Begin typing your search above and press return to search.

షర్మిల పార్టీ మీద బ్రదర్ అనిల్ తేల్చేశారుగా... ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 10:32 AM GMT
షర్మిల పార్టీ మీద బ్రదర్ అనిల్ తేల్చేశారుగా... ?
X
ఏపీలో రాజకీయం చూస్తే మామూలుగా లేదు. ఎవరి నోట ఏ మాట వచ్చినా కూడా ప్రతీ మాటకూ ఒక చర్చ. ఒక విశ్లేషణ. ఇలా సాగిపోతోంది. రీసెంట్ గా వైఎస్ జగన్ సోదరి, తెలంగాణాలో వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేసిన షర్మిల ఏపీలో కూడా పార్టీ పెట్టే విషయంలో కొన్ని డౌట్లు అయితే మీడియాకు వదిలేశారు. కేవలం ఏపీ గురించే కాకుండా దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టే అవకాశం ఉందని ఆమె చెప్పారు. అయితే దాని మీద చాలా పెద్ద రాజకీయ రచ్చ సాగుతోంది.

ఇక దీని మీద షర్మిల మరోమారు వివరణ ఇచ్చారు. తాను తెలంగాణాలోనే రాజకీయం చేస్తానని, అక్కడి ప్రజలకు సేవ చేయడానికే బద్ధురాలిగా ఉన్నానని చెప్పారు. అయినా సరే ఎవరికి తోచిన తీరున రాజకీయ ఊహాగానాలు అలా సాగిపోతూనే ఉన్నాయి. ఇక దీని మీద విజయవాడ వచ్చిన షర్మిల భర్త, బ్రదర్ అనిల్ కుమార్ ని కూడా మీడియా వదలడంలేదు.

ఆయన వ్యక్తిగత పనుల మీదనే తాను విజయవాడ వచ్చానని చెప్పినా మీడియా మైకులు పెట్టి మరీ వివరణ కోరింది. ఇంతకీ అడిగింది ఏంటి అంటే ఏపీలో షర్మిల పార్టీ పెడతారా అని, దాని మీద వాయిస్ బైట్ కూడా కావాలని కోరడం విశేషం. అయితే దీనికి అనిల్ కుమార్ కూడా తెలివిగానే రియాక్ట్ అయ్యారనుకోవాలి.

తాను ఒక పెళ్ళికి హాజరయ్యేందుకు మాత్రమే విజయవాడ వచ్చానని చెప్పారు. అంతే కాదు, తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. తనకు షర్మిల పార్టీకి కూడా సంబంధం లేదని తేల్చేశారు. దాంతో ఏపీలో షర్మిల పార్టీ ప్రచారానికి ఆయన నుంచి మీడియా ఆశించిన జవాబు అయితే రాలేదనుకోవాలి. బిగ్ బ్రేకింగ్ గా న్యూస్ వస్తుందనుకుంటే బ్రదర్ అనిల్ పాలిటిక్స్ లో లేను మహానుభావా అనేడయం విశేషమే మరి.