Begin typing your search above and press return to search.
బ్రదర్ అనిల్ జోక్యమే వద్దు... సంచలనమే....?
By: Tupaki Desk | 29 March 2022 2:30 AM GMTబ్రదర్ అని కుమార్ క్రైస్తవ మత బోధకుడు. వైఎస్సార్ ఇంటి అల్లుడు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కి బావ. అలాంటి అనిల్ ఈ మధ్య ఏపీ రాజకీయ వార్తాలలో బాగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన కేవలం మత ప్రభోదకుడిగానే ఉండేవారు. ఇపుడు ఆయన రాజకీయ పార్టీ పెడతారు అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అదే సమయంలో ఆయన కూడా విజయవాడ, విశాఖలలో వరసగా వివిధ సంఘాలకు చెందిన వారితో భేటీ అవుతున్నాయి.
ఏపీలో బీసీ సీఎం కావాలని వారు కోరుకుంటున్నారని విశాఖ మీడియా మీట్ లో మాట్లాడి సంచలనం రేపిన అనిల్ కొత్త రాజకీయ పార్టీని పెట్టమంటున్నారు అని కూడా మరో బాంబు పేల్చారు. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఆయన మీద తన తోటి క్రైస్తవ సంఘాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కోవడమే లేటెస్ట్ న్యూస్.
బ్రదర్ తన రాజకీయ ఆశయాల కోసం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టవద్దంటూ ఆంధ్రా ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ ప్రతినిధులు కోరడం విశేషం. ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ ప్రమేయం పెరిగిపోతోందని వారు పేర్కొన్నారు. సదరు ఇక బ్రదర్ అనిల్ మీద వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే గుంటూరులో 180 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఆంధ్రా ఎవాంజెలికల్ లూథరన్ చర్చి దానికి సంబంధించిన ఆస్తులలో అనవసర జోక్యం చేసుకుంటున్నారు అని.
ఆంధ్రా ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ కి గుంటూరులోని ప్రముఖ ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీతో సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆస్తులు ఉన్నాయి. దాంతో ఈ అతి పెద్ద చర్చి వ్యవహారాల్లో అనిల్‌కుమార్ జోక్యాన్ని ఖండిస్తూ సంస్థ సభ్యులు సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీలో చర్చి సభ్యులు మాత్రమే ఉండాల్సి ఉండగా, అనిల్‌కుమార్ మద్దతుతో బయటి వ్యక్తులు పదవులను కైవసం చేసుకున్నారని వారు ఆరోపించడం విశేషం.
ఇక కోశాధికారిగా అనిల్‌కుమార్‌కు సన్నిహితుడిగా చెబుతున్న లాజరస్ అబ్రహం అనే వ్యక్తిని నియమించి చర్చి ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఇక ఈ సమావేశంలోనే అనిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకోవాలని, బ్రదర్ అనిల్‌ను చర్చి కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
మొత్తానికి చూస్తే ఇటీవల రాజకీయ వ్యాఖ్యలు కారణంగానే బ్రదర్ అనిల్ మీద ఇలా తోటి క్రిస్టియన్ సంస్థల ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి బ్రదర్ అనిల్ బిగ్ ట్రబుల్స్ లో పడుతున్నారా, ఆయన్ని నెడుతున్నారా అన్న చర్చ అయితే ఉంది.