Begin typing your search above and press return to search.
రిక్వెస్ట్ టైమ్ : పార్టీ పెట్టండి అనిల్.. ! అల్లుడా మజాకా !
By: Tupaki Desk | 14 April 2022 8:40 AM GMTరానున్న కాలంలో కొత్త పార్టీ ఒకటి వచ్చే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా కొందరు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా గత కొంత కాలంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న వారంతా ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటుకోవాలని యోచిస్తున్నారు. ఇందుకు తగ్గ సమయం, సందర్భం కలిసి రావాలే కానీ తామేంటో నిరూపిస్తామని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో క్రీస్టియన్ సంఘాలను సంఘటితం చేసి ఓటు బ్యాంకు రాజకీయం నడిపిన బ్రదర్ అనిల్ (వైఎస్ అల్లుడు) ఇప్పుడు తాజాగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏమయినా సరే క్రీస్టియన్ మరియు మైనార్టీ విభాగాలను కలిపి పార్టీ ఏర్పాటుకు ముందుకు పోవాలని యోచిస్తున్నారని సమాచారం.
వాస్తవానికి ఎప్పటి నుంచో బ్రదర్ అనిల్ పార్టీ పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ వాకిట వైసీపీ లేదు. కానీ వైస్సార్టీపీ ఉంది. అది కూడా అనుకున్న ఫలితాలు సాధించేందుకు సిద్ధంగా లేదు. ఈ తరుణంలో తాము వద్దన్నా పార్టీ పెట్టిన షర్మిల విషయమై జగన్ వర్గాలు కొంత కోపంగానే ఉన్నాయి. అందుకే ఆమెను దూరం పెట్టారన్న వార్తలు కూడా వైఎస్ 12వ వర్ధంతి వేళ వచ్చాయి.
ఆ రోజు జరిగిన సంస్మరణ సభకు జగన్ వెళ్లకపోవడానికి ప్రధాన కారణం కూడా మనస్పర్థలే! ఇవి ఇంకా తీవ్రం అయి పెను గాలుల ప్రభంజనంలా మారేందుకు అవకాశం ఉందన్న మాట జగన్ వర్గాల నుంచే అప్పట్లో వినవచ్చాయి. కానీ ఎందుకనో షర్మిల వెనుకంజ వేశారు. ఏకంగా తెలంగాణ కేంద్రంగా తన పని తాను చేసుకుని పోతున్నారు.
కష్టం అయినా సరే మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇక అక్కడ బలంగా ఉన్న టీఆర్ఎస్ ను కూడా విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ఆమెకు రావాల్సినంత పొలిటికల్ మైలేజ్ రాని కారణంగా కొత్తగా చేసేదేం లేదని తేలిపోయింది.
అందుకనే తమకు బలంగా ఉన్న ఆంధ్రాలోనే క్రీస్టియన్, మైనార్టీలతో పాటు దళిత మరియు బడుగు వర్గాలను కలుపుకుని కలిసి వచ్చే శక్తులతో పార్టీ ఏర్పాటుకు సమాయత్తం అయి వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విధంగా ప్రభావం చూపి అన్నపై పైచేయి సాధించాలని భావిస్తున్నారు షర్మిల. ఇందుకోసం బ్రదర్ అనిల్ ఇప్పటి నుంచి ఆమె తరఫున గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
ఆ రోజు అన్న జగన్ అధికారంలోకి వచ్చేందుకు షర్మిల ఎంతగానో కృషి చేశారని కానీ ఆమెకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదన్న అక్కసుతోనే కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని బ్రదర్ అనిల్ తరఫు మనుషులు మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.