Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ...వైఎస్సార్టీపీ...వైఎస్సార్ ఏపీ..?
By: Tupaki Desk | 20 March 2022 8:30 AM GMTఏమిటీ పేర్లు అనుకుంటున్నారా. రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారికి మొదటి రెండు పేర్లూ పాతవే. అయితే మూడవ పేరే కాస్తా కొత్తగా ఉంది కదూ. అదే వైఎస్సార్ ఏపీ. ఈ రోజుకు వైఎస్సార్ ఏపీ పేరిట ఏ పార్టీ పుట్టలేదు, కానీ పుట్టవచ్చు అని జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. రాజకీయ జనాలలో మాత్రం అది గట్టిగానే ఇన్నర్ టాక్ గా సాగుతోంది అంటున్నారు.
ఇక వైఎస్సార్సీపీ అంటే జగన్ అధినాయకుడు. ఆయనే దానికి సర్వం సహా. ఏపీలో ఆయన అధికారంలోకి వచ్చారు. పదేళ్ళ రెక్కల కష్టం తోనే తాను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే నాడు అన్నకు వెన్ను దన్నుగా జగనన్న వదిలిన బాణంగా షర్మిల ఏపీలో దూసుకువచ్చి వైఎస్సార్సీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.
దాంతో ఆ పార్టీ అధికార పీఠానికి చేరువ కావడం మరింత సులువు అయింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏణ్ణర్ధం పూర్తి అయ్యాక షర్మిల తెలంగాణాలో రాజకీయ అరంగేట్రానికి అడుగులు వేశారు. అదెలా అంటే వైఎస్సార్టీపీ పేరిట. ఆ పార్టీని ఆమె స్థాపించి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని చెప్పుకున్నారు.
అయితే జగన్ కి ఏ మాత్రం ఇష్టం లేదని ప్రచారం జరిగింది. దాని మీద ప్రభుత్వ సలహాదారుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఉన్న మాట ఏంటో చెప్పేశారు. షర్మిల జగన్ ల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని, అందుకే ఆమె వేరే చోట పార్టీ పెట్టారని వివరించే ప్రయత్నం చేశారు. ఆ కధ అలా సాగుతూండగానే ఇపుడు షర్మిల భర్త, జగన్ కి బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఆయన వైసీపీకి ఏపీలో బలమైన ఓటు బ్యాంక్ అనదగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తన మాట విని వారంతా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతున్నా వారికి తగిన న్యాయం జరగలేదని, అందుకే తాను వారితో మాట్లాడుతున్నానని అది తన బాధ్యత అని ఆయన చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విజయవాడలో పర్యటించినపుడే ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న చర్చ వచ్చింది. దానికి ఆయన లేదు అని ఖరాఖండీగానే ఖండించారు. ఇక ఆ తరువాత విశాఖ టూర్ పెట్టుకున్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన అనిల్ కొత్త పార్టీ అంటున్నారు, బీసీ సీఎం అని కూడా అంటున్నారు అని తన మనసులోని విషయాలను బోల్డ్ గా చెప్పేశారు.
అదే టైం లో కొత్త పార్టీ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని కూడా ఆయన చెప్పడం విశేషం. అయితే అనిల్ ఏపీలో టూర్లు వేయడం రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల ఏపీ క్రిస్టియన్ జేఏసీ మండిపడింది. ఏమైనా రాజకీయాల ఆసక్తి ఉంటే తెలంగాణాలో చూసుకోవాలని, ఏపీలో తలదూర్చవద్దని కూడా జేఏసీ నేతలు సున్నితంగానే హెచ్చరించారు.
అయితే ఈ పరిణామాల మీద అధికార వైసీపీ అయితే అఫీషియల్ గా ఇంతవరకూ రియాక్ట్ కాలేదు, లానీ క్రిస్టియన్ జేఏసీ స్టేట్మెంట్స్ వెనక కూడా వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కొత్త పార్టీ పెడితే దానికి పేరు ఏంటి అన్న దాని మీద కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. వైఎస్సార్ ఏపీ పేరిట పార్టీని స్థాపిస్తారు అని పేరు కూడా చెప్పేస్తున్నారు.
అంటే షర్మిల పార్టీ తెలంగాణాలో వైఎస్సార్ టీపీ కాబట్టి ఏపీలో అలాంటి పోలికతో వైఎస్సార్ ఏపీ అని పెడతారు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ గాలి వార్తలుగానే ఉన్నాయి ఈ రోజుకు. అయితే మాత్రం అనిల్ వరస పర్యటనలు, షర్మిల అక్కడ కొత్త పార్టీ పెట్టడం, అన్నకు చెల్లెలుకు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయన్న ప్రచారం నేపధ్యంలో ఏపీలో కూడా ఏమైనా జరగవచ్చు అన్నదైతే అంతా ఊహిస్తున్నారు.
ఇక అనిల్ కేవలం ఒక్కడు కాదని, ఆయన వెనకాల రాజకీయ నేతలు ఉన్నారని అంటున్నారు. వారు విపక్షాలకు చెందిన నేతలని, జగన్ వ్యతిరేకులని కూడా అంటున్నారు. ఏపీలో జగన్ కి బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చీల్చడం ద్వారా రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నదే వారి వ్యూహమని అంటున్నారు. మరి అలా ఎవరు ఉన్నారు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. మొత్తానికి చూస్తే జగన్ కి ఇంటా బయటా కూడా రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతునాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.