Begin typing your search above and press return to search.
ఉండవల్లి-బ్రదర్ అనిల్ భేటీ.. ఏమన్నారంటే..
By: Tupaki Desk | 25 Feb 2022 9:30 AM GMTరాజకీయ విశ్లేషకులు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో తాజాగా ఏపీ సీఎం జగన్ బావమ రిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. స్వయంగా ఉండవల్లి ఇంటికి వెళ్లిన అనిల్.. సుమా రు గంటన్నర పాటు.. ఆయన నివాసంలో గడిపారు.
అనంతరం.. ఇరువురు.. మీడియాతో మాట్లాడారు. ఈ భేటీకి చాలా ప్రత్యకతలు ఉన్నాయని చెప్పిన ఉండవల్లి.. అనిల్‌తో భేటీ కావడం.. వైఎస్‌తో ఉన్న అనుబం ధాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టు అయిందన్నారు.ఈ భేటీలో అనేక రాజకీయపరమైన, ఏపీ, తెలంగాణ పర మైన అనేక అంశాలు చర్చించుకున్నట్టు తెలిపారు.
అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు అంటే మంచి చేయటమని.. తమకు, తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని. ఎప్పుడూ రాజకీయాల్లోనే ఉన్నామన్నారు. అయితే.. తానెప్పుడూ.. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకిరాలేదని చెప్పారు. రాజకీయంగా ఉండవల్లి ఎంతో జ్ఞానం సంపాయించుకున్నా రని..ఆ యన ఏం మాట్లాడినా.. చాలా అధ్యయనం చేసి చెబుతారని.. ఇప్పుడు రాజకీయ జ్ఞానం తెలుసు కునేందుకు ఉండవల్లిని కలిసినట్లు బ్రదర్ అనిల్ అన్నారు.
అయితే.. ‘‘మా సీక్రెట్‌లు మాకు ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి’’ అని తెలిపారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగింద న్నారు. తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని, దేవుడు చెప్పకుం డా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు. మరోవైపు ఉండవల్లి... మాట్లాడుతూ.. వివిధ కారణాలతో వైఎస్ కుటుంబం తనకు దూరమైందని..ఇప్పుడు అనిల్ రావడంతో మరోసారి రెన్యువల్ అయినట్టు గా భావిస్తు న్నానని అన్నారు.
అంతేకాదు.. బ్రదర్ అనిల్‌ను ఈ సందర్భంగా ఉండవల్లికొనియాడారు. ఆయన తనకు 25 ఏళ్లుగా తెలుసునని.. స్మార్ట్‌గా ఉంటారని చెప్పారు. తమ మధ్య అనేక విషయాలుచర్చలకు వచ్చాయని చెప్పిన ఉండవల్లి.. వీటిపై తర్వాత విడతల వారీగా వెల్లడిస్తానని... ఇప్పటికిప్పుడు చెప్పే విషయాలు కావని ఆయన వ్యాఖ్యానించారు.
ఇకముందు కూడా తమ మధ్య ఇలాంటి భేటీలు జరుగుతూనే ఉంటాయన్నారు. ప్రస్తుతం జరిగిన భేటీ తనకుఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.