Begin typing your search above and press return to search.
లవ్ మ్యారేజ్ చేసుకుందని చెల్లి తల నరికి సెల్ఫీ దిగిన అన్న.. తల్లి
By: Tupaki Desk | 7 Dec 2021 4:36 AM GMTపుట్టేటప్పుడు వచ్చే కులం.. వెళ్లేటప్పుడు వెంట రాదని తెలిసినా.. మన దేశంలో కులానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కాలం మారినా.. తరాలు మారుతున్నా.. ప్రపంచం గ్లోబల్ అవుతున్నప్పటికీ.. ప్రేమ పెళ్లిని అంగీకరించేందుకు ససేమిరా అనే కుటుంబాలు ఇప్పటికి కోట్లల్లో ఉన్నారు.
ఎవరి భావోద్వేగాలు వారివి అనుకుంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుందని.. రాక్షసంగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. తాజా ఉదంతం గురించి వింటే.. ఇంతటి రాక్షసులు మన చుట్టూ ఉన్నారా? అన్న భావన కలుగక మానదు. మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన కనీస మానవత్వం లేకుండా పోయి.. అత్యంత అమానుషంగా వ్యవహరించిన వైనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం వివరాలు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఈ హింస మనల్ని చాలా ఎక్కువగా డిస్ట్రబ్ చేయటం ఖాయం.
కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో చెల్లి తల నరికిన అన్న.. ఆ రాక్షసుడికి అండగా నిలిచిన ఒక దుర్మార్గపు తల్లి ఉదంతంగా దీన్ని చెప్పాలి. నమ్మకంగా మాట్లాడి.. తియ్యటి మాటలు చెప్పి.. తమ ప్రేమను తమ ఇంటి వారు అర్థం చేసుకున్నారన్న ఆశలు కల్పించి.. దారుణంగా హతమార్చిన వైనాన్ని ఒక పట్టాన జీర్ణించుకోలేం.
తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. గోయే గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కృతి.. అవినాశ్ థోరేను ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోవటంతో.. ఆర్నెల్ల క్రితం ఆమె ఇంట్లో నుంచి పారిపోయి.. మనసు ఇచ్చినోడిని పెళ్లి చేసుకుంది. వారు లడ్గావ్ లో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కృతి తల్లి ఆమెను కలిసింది. ఆమె ఫోన్ నెంబరు తీసుకుంది. ఆమె ప్రేమ వివాహాన్ని తాను ఆమోదించినట్లుగా మాయ మాటలు చెప్పింది. ఆదివారం కొడుకును తీసుకొని వస్తానని కృతికి మాయ మాటలు చెప్పింది. చెప్పినట్లే.. వారు ఇంటికి వచ్చారు. మాటలు అయ్యాక.. టీ పెట్టేందుకు కృతి వంట గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఒంట్లో బాగోకపోవటంతో ఆమె భర్త వేరే గదిలో ఉన్నాడు. టీ పెడుతున్న కృతి వద్దకు వచ్చిన తల్లి.. సోదరుడు.. మాటలు చెబుతున్నారు.
వారంతా కలిసి తన ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న ఆమె.. ముంచుకొస్తున్న అపాయాన్ని ఊహించలేదు. టీ పెడుతున్న కుమార్తెను తల్లి గట్టిగా పట్టుకుంటే.. సోదరుడు దాడి చేశాడు. కుమార్తె కాళ్లను తల్లి గట్టిగా పట్టుకుంటే.. సోదరుడు ఆమె తలను నరికేశాడు. భార్య అరుపులతో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆమె భర్త.. జరిగిన దారుణాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అతడి మీదా దాడికి యత్నించగా.. అక్కడి నుంచి పారిపోయాడు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందున్న ఆగ్రహంతో.. కృతి తల నరికి.. దాన్ని పట్టుకొని బయటకు వచ్చిన అమ్మా కొడుకు వీరంగమే వేశారు. ఆమె తల పట్టుకొని సెల్ఫీలు దిగి రాక్షసానందానికి గురయ్యారు. అనంతరం.. ఈ తల్లి కొడుకులు ఇద్దరు పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఎంత ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం మరీ ఇంత దారుణంగా వ్యవహరించటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.