Begin typing your search above and press return to search.
అప్ఘన్ విమానం నుంచి పడిపోయింది అన్నాదమ్ములే
By: Tupaki Desk | 20 Aug 2021 12:30 AM GMTఅప్ఘనిస్తాన్ లోని కాబూల్ నుంచి బయలు దేరిన అమెరికా విమానం నుంచి ఆకాశంలో ఎగురుతుండగా పడి చనిపోయిన వారి ఆచూకీ తాజాగా తెలిసింది. ఇద్దరు కిందపడ్డ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఈ ఘటన నివ్వెరపరిచింది. ఆ ఇద్దరు ఎవరన్నది తాజాగా తెలిసింది.
తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతోనే ఆ ఇద్దరూ అమెరికా విమానాన్ని బయట పట్టుకొని గాల్లోకి ఎగిరారని.. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా.. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి.
కిందపడి ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16)గా గుర్తించారు. వీరిద్దరూ అన్నాదమ్ములేనని.. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన టీనేజర్లు అని గుర్తించారు. వీరి కుటుంబంలో మొత్తం 8మంది ఉంటారు. తాలిబన్లు దేశాన్ని వశపరుచుకున్నాక ఈ అన్నాదమ్ములు ఆందోళన చెందారు. కెనడా, అమెరికాలో అప్ఘన్ దేశస్థులకు ఆశ్రయిస్తున్నట్టు స్తానికులు చెప్పడం విని వీరిద్దరూ కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకొని కాబూల్ లోని విమానాశ్రయానికి పరిగెత్తుకుంటూ వచ్చారు.
కాబూల్ విమానాశ్రయంలో కదులుతున్న అమెరికా యుద్ధవిమానం ఎక్కారు. విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. విమానం ఎగిరిన తర్వాత ఆకాశంలోంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి పడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
మరో యువకుడు కబీర్ జాడ మాత్రం ఇంతవరకూ తెలియలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. అతడి డెడ్ బాడీ ఎక్కడ పడిందనేది వెతుకుతున్నారు.