Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ ఎఫెక్ట్‌: ఏపీలో ఎవ‌రి ఓట్ల‌కు ఎస‌రు..!

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:52 AM GMT
బీఆర్ ఎస్ ఎఫెక్ట్‌: ఏపీలో ఎవ‌రి ఓట్ల‌కు ఎస‌రు..!
X
ఏపీలో కొత్త‌గా ఓట్లు పెరుగుతున్న‌ది కేవ‌లం 5 నుంచి 6 ల‌క్ష‌ల ఓట్ల‌నే అంచ‌నా ఉంది. వీరంతా కూడా యువ‌తే. దీంతో పార్టీలు ఇప్పుడు వారిపై క‌న్నేశాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న బీఆర్ ఎస్ జాతీయ పార్టీ.. ఏపీలో ఎవ‌రి ఓట్ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. కొత్త ఓటర్ల‌ను టార్గెట్ చేయ‌డం మానేసినా.. ఉన్న ఓట్ల‌పై క‌న్నేసినా.. అవి ఇప్ప‌టికే ఉన్న టీడీపీ, వైసీపీ, జ‌న‌సేనల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, సీమ‌ల‌పై.. కేసీఆర్ దృష్టి పెట్ట‌నున్న‌ట్టు రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ‌, ఉభ‌య గోదావ‌రి , గుంటూరు జిల్లాల్లో.. హైద‌రాబాద్లో సెటిలైన కుటుంబాల ఓట్ల‌పై కేసీఆర్ దృష్టి పెట్ట‌నున్నారు.

ఈ క్ర‌మంలో ఆయా జిల్లాల్లో ఇప్ప‌టికే బ‌లంగా ఉన్న టీడీపీపై ప్ర‌భావం చూపుతుంద‌నే లెక్క‌లు వినిపిస్తున్నాయి. బ‌హుశ ఈ విష‌యాన్ని గ‌మ‌నించే.. టీడీపీ ముందుగా నే అలెర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు ప్రారంభించింది.

బీఆర్ ఎస్ నిజాయితీ లేని పార్టీ అని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అంతేకాదు.. కేసీఆర్ ను నీతి లేని నాయ‌కుడ‌ని కూడా అంటున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ మాత్రం 'వ‌స్తే.. రానీ' అని వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఇక‌, ఎలాంటి ఓటు బ్యాంకుసంస్థాగ‌తంగా లేద‌ని.. బీజేపీ కూడా రియాక్ట్ అయింది. మ‌రి.. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న వారు త‌మ వెంటే ఉంటార‌ని.. వైసీపీ అంచ‌నా వేస్తోంది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగితే.. అది బీఆర్ ఎస్‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ లెక్క‌లు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్ ఏపీలోకి రావ‌డాన్ని వైసీపీ కోరుకుంటున్న‌ట్టుగానే తెలుస్తోంది.

అయితే.. దీనిపై నేరుగా స్పందించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం ఓటు బ్యాంకు చీల‌డాన్నే ఇష్ట‌ప‌డుతున్న ప‌రిస్తితి ఉంది. బీఆర్ ఎస్ వ‌చ్చినా.. అధికారంలోకి వ‌చ్చే స్తాయిలో రాజ‌కీయాలు చేసే ప‌రిస్థితి ఉండ‌దు కాబ‌ట్టి..త‌మ‌కు ఇబ్బందిలేద‌నే భావ‌న వైసీపీలో వినిపిస్తోంది. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీకే ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటుంద‌నే అంచ‌నా హ‌ల్చ‌ల్ చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.