Begin typing your search above and press return to search.
బీయారెస్ దెబ్బ జగన్ కా... చంద్రబాబుకా...?
By: Tupaki Desk | 12 Dec 2022 5:30 PM GMTఏపీలో బీయారెస్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. పార్టీ ఆఫీస్ ను రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయం కాబట్టి బీయారెస్ గట్టిగా దిట్టంగా అన్నీ చూసుకునే దిగుతోంది. ఇక బీయరెస్ ఇలా ఉరుము లేని పిడుగులా నెత్తి మీద పడితే ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా పొలిటికల్ సీన్ చీలిపోయి ఉంది.
బీయారెస్ కనుక వస్తే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. వైసీపీతో పొత్తు అంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే జగన్ ఒంటరిగానే పోటీ చేస్తారు. అదే విధంగా రాజకీయం పండాలీ అంటే అధికార పార్టీని విమర్శించాలి అపుడే ఓట్లు నాలుగు రాలతాయి. అంటే విపక్షాలు వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాయో అదే విధంగా బీయారెస్ కూడా సౌండ్ చేయాలి. జగన్ నామ స్మరణతో తరించాలి. మరి ఆ పని చేయడానికి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి కదా.
అంటే జగన్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని పంచుకోవడానికి విపక్షం చూస్తూంటే మధ్యన పడి బీయారెస్ కూడా తన వాటా ఎంతో తేల్చుకుంటుంది అన్న మాట. ఇక ఏపీలో చూస్తే జగన్ కి కేసీయార్ మధ్య తగాదాలు అయితే లేవు. ఇక రాష్ట్ర సమస్యల మీదనే ఇద్దరి మధ్యన కొంత వివాదం ఏర్పడింది. రాయలసీమ నీటి విషయంలోనే ఇద్దరూ కొంత ఎడం గా ఉంటున్నారు.
నిజానికి జగన్ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాజకీయాల వైపు అసలు చూడడం మానేశారు. అక్కడ కెలుక్కోవడం ఎందుకు అన్నట్లుగా ఆయన ఉన్నారు. పూర్తిగా ఏపీకే పరిమితం అయ్యారు. అదే టైం లో జగన్ కి కేసీయార్ సపోర్టు ఉందని వార్తలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని కేసీయార్ చేయాల్సింది అంతా చేశారని తెర వెనక ఎంతో సాయం అందించారని వార్తలు వచ్చాయి.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ తో కేసీయార్ గొడవ పడరు అనే అంటారు. ఏపీలో సీఎం గా మరోసారి జగన్ వచ్చినా బీయారెస్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అదే చంద్రబాబు వస్తేనే ఆయన తెలంగాణా కోటకు కూడా ముప్పు అన్న కలవరం ఉంది. కాబట్టి బీయారెస్ గన్ ఎక్కుపెట్టేది విపక్షం మీదనే అంటున్నారు. అందునా టీడీపీ మీదనే అని అంటున్నారు. ఇక ఏపీలో విపక్షం వైపు వచ్చి కేసీయార్ ఇచ్చే స్పీచులు చూస్తే కచ్చితంగా అది బాబుకు దెబ్బగానే చూస్తారు అని అంటున్నారు.
మంచి వక్తగా వ్యూహకర్తగా ఉన్న కేసీయార్ ముందు ఏపీలో విపక్షం కొంత ఇబ్బంది పడుతుంది అన్న చర్చ ఉంది. మరో వైపు చూస్తే వైసీపీకి కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉంది. విపక్షం అంతా చీలిపోకుండా ఉంటూ జగన్ని అఒడించాలని భావిస్తోంది. కానీ ఇపుడు సడెన్ ఎంట్రీ బీయారెస్ ఇస్తే మాత్రం విపక్షాల ఓట్లలో భరీ చీలిక తప్పదు. అది కచ్చితంగా జగన్ కి మేలు చేస్తుంది. అదే టైం లో టీడీపీకి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే కేసీయార్ కులం కూడా ఏపీలో రాజకీయ పార్టీల ఓట్లకు చిల్లు పెట్టబోతోంది అంటున్నారు. ఉత్తరంధ్రా కోస్తా జిల్లాలలో బలంగా ఉన్న వెలమ సామాజికవర్గం ఓట్లను అలాగే బీసీల ఓట్లను కేసీయార్ కొల్లగొడితే దాని వల్ల టీడీపీకి ఇబ్బందే అంటున్నారు. అయితే కేసీయర్ తనతో పాటు మజ్లీస్ ఒవైసీని కూడా తెస్తే రాయలసీమ జిల్లాలలో పోటీ చేయిస్తే మాత్రం ఆ ప్రభావం కచ్చితంగా ఎంతో కొంత వైసీపీ మీద కూడా పడుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బీయారెస్ రాక మీద వైసీపీ అయితే పెద్దగా రియాక్ట్ కావడం లేదు.
ఎందుకంటే విపక్షం ఓట్ల చీలిక తమకు ఆ విధంగా లాభం కాబట్టి. ఇక బీయారే రాజకీయ అడుగులు దాని విధానం ఏంటో తెలిసాక విపక్షం నోరు విప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. కేసీయార్ ప్రత్యేక హోదా అంటారు, ఏపీకి వరాలు ప్రకటిస్తారు. మరో హైదరాబాద్ గా ఏపీని చేస్తామని అంటారు. ఇలాంటి హామీలు సహజంగా విపక్షంలో ఉన్న టీడీపీనే ఇరకాటంలో పెడతాయని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా కేసీయార్ ని పల్లెత్తి ఒక్క మాట అనని బాబు కూడా నోరు చేసుకోవాల్సి వస్తుందేమో అన్న చర్చ అయితే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.