Begin typing your search above and press return to search.
ఏపీలో బీయారెస్ కి నో ప్లేస్... ఇది పక్కా...?
By: Tupaki Desk | 7 Oct 2022 8:34 AM GMTకొత్త పార్టీ అంటూ బీయారెస్ పేరిట గులాబీ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి ఏపీలో కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీయారెస్ కి ఏపీలో ఎలాంటి చోటూ ఉండదని లైట్ తీసుకుంటున్నాయి. అదే టైమ్ లో బీయారెస్ ని ఒక్క లెక్కన ఏకి పారేస్తున్నాయి. అసలు జాతీయ పార్టీ పెట్టే సీన్ కేసీయార్ కి ఉందా అని కూడా నిలదీస్తున్నాయి. ఇప్పటిదాకా చూస్తే వైసీపీ నేతలు కేసీయార్ కొత్త పార్టీ మీద లో ప్రొఫైల్ లోనే కామెంట్స్ పాస్ చేస్తూ వచ్చారు.
ఆయన పార్టీ పెట్టుకుని ఏపీకి వచ్చి పోటీ చేయవచ్చు మాకేమీ కాదు అని వైసీపీ మంత్రులు సహా కీలక నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఒక నవ్వు నవ్వేసి సైలెంట్ అయ్యారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం కాస్తా హార్ష్ గానే రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే కేసీయార్ జాతీయ పార్టీ అని ప్రకటించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని కొట్టి పారేశారు.
ఎవరైనా జాతీయ పార్టీగా చెప్పుకోవచ్చు కానీ ఎన్నికల సంఘం వద్ద తగిన గుర్తింపు దక్కాలీ అంటే మాత్రం కచ్చితంగా నిబంధనలనలు లోబడి సీట్లూ ఓట్లూ సాధించాల్సి ఉంటుందని గోరంట్ల అంటున్నారు. ఇక కేసీయార్ కి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీతో మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ తో పొత్తు ఎలా కుదురుతుందో అర్ధం కావడం లేదని కూడా గోరంట్ల సెటైర్లు వేశారు.
ఏపీ లో చూస్తే బీయారెస్ కి ఎలాంటి ప్లేస్ ఉండదని గోరంట్ల క్లారిటీగా చెప్పేశారు. ఉమ్మడి ఏపీని రెండుగా విభజించిన పార్టీగా జనాలు చూస్తారని, ఇక సీమాంధ్ర కష్టాల పాలు కావడానికి కారణమైన బీయారెస్ ని ఆదరించే ప్రశ్నే లేదని గోరంట్ల విశ్లేషించారు. అయినా జాతీయ పార్టీ అనడం కాదు ముందు మునుగోడు ఉప ఎన్నికల్లో టీయారెస్ గెలవాలని, ఆనక 2023లో జరిగే తెలంగాణా ఎన్నికల్లో కూడా గెలవాలని అపుడు కదా జాతీయ రాజకీయాల ముచ్చట అంటూ గోరంట్ల సెటైర్లు వేశారు.
ఇక గతంలో రాజకీయం కోసమే తెలంగాణా సెంటిమెంట్ ని రెచ్చగొట్టిన కేసీయార్ ఇపుడు ఆ అవసరం తీరిపోయినందువల్లనే బోర్డు తిప్పేసి పేరు మార్చేశారని గోరంట్ల అంటున్నారు. మరో నేత ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు అయితే కేసీయార్ లో నిజాయతీ లేదని, ఆయన పార్టీకి జాతీయత లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీతో ఫోటోలు తీయించుకుని వచ్చిన కేసీయార్ ఆ తరువాత ఏం చేశారో తెలిసిందే అన్నారు.
అలాగే తెలంగాణాకు తొలి సీఎం దళితుడు కావాలని చెప్పి ఇపుడు కుటుంబ పాలనకు తెరతీశారని విమర్శించారు. జాతీయ పార్టీ అని పెట్టుకుంటే సరిపోతుందా అందులో జాతీయత ఉండాలిగా అని అశోక్ బాబు అంటున్నారు. ఉడత తన పేరుని పులిగా మార్చుకుంటే పులి అయిపోతుందా అంటూ అశోక్ బాబు సెటైర్లు టీయారెస్ కి మంటగానే ఉంటాయేమో. ఇక దేశంలో చూస్తే ఏ రాష్ట్రమైనా బీయారెస్ ని ఆదరిస్తుందేమో కానీ ఏపీలో ఆ పార్టీ అసలు అడుగుపెట్టలేదని అశోక్ బాబు తేల్చి చెప్పారు. ఉమ్మడి ఏపీని అడ్డంగా విడదీసి ఏపీని ఆర్ధికంగా దెబ్బతీశారంటూ కేసీయార్ మీద నిప్పులు చెరిగారు.
మొత్తానికి చూస్తే కేసీయార్ పార్టీ మీద తమ కోపాన్ని, నిరసనను, వ్యంగ్యాన్ని కూడా టీడీపీ ఇలా బయటపెట్టుకుంది అని అంటున్నారు. మరి టీడీపీ వారు అన్నట్లుగానే ఏపీలో సోదిలో లేకుండా బీయారెస్ పోతుందా. ఏమో జనాలు ఈ విషయం చెప్పాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.