Begin typing your search above and press return to search.

ఏపీలో బీఆర్ ఎస్‌-తెలంగాణ‌లో టీడీపీ.. ఒక‌రిపై ఒక‌రు.. ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   26 Dec 2022 9:13 AM GMT
ఏపీలో బీఆర్ ఎస్‌-తెలంగాణ‌లో టీడీపీ.. ఒక‌రిపై ఒక‌రు.. ఏం జ‌రుగుతుంది?
X
రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు కూడా సంక్రాంతికి నెల రోజుల ముందే భారీ ఎత్తున భోగిమంట‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. నా నోట్లో నువ్వు వేలు పెడితే.. నీ కంట్లో నేను వేలు పెడ‌తా! అన్న‌ట్టుగా రెండు తెలుగు రాష్ట్రాలకుచెందిన బీఆర్ ఎస్‌, టీడీపీ పార్టీలు రాజ‌కీయంగా దూకుడు పెంచాయి. ముఖ్యంగా టీడీపీఅ ధినేత చంద్ర‌బాబు దాదాపు తెలంగాణ‌లో పార్టీని మ‌రిచిపోయార‌ని.. పార్టీని వ‌దిలేశార‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.. ఇలాంటి కీల‌క‌స‌మ‌యంలో.. అనూహ్యంగా చంద్ర‌బాబు తెలంగాణ‌లో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మ‌డి ఖ‌మ్మంలో స‌భ పెట్టారు. ఇది సూప‌ర్ హిట్ అయింద‌ని.. టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని ప‌ఠించారు. నాయ‌కులు తిరిగి రావాల‌న్నారు. తెలంగాణ‌ను తానే నిర్మించాన‌ని చెప్పారు. ఈ ప‌రిణామాలు స‌హ‌జంగానే.. బీఆర్ ఎస్‌కు ఇబ్బందిగా మారాయి.

ఎందుకంటే.. టీడీపీ వ‌స్తే.. సెటిల‌ర్ల ఓట్లు గంప‌గుత్త‌గా బీఆర్ ఎస్ నుంచి జారిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో టీడీపీ ఎలా వ‌స్తుంద‌ని అన‌డం మానేసిన నాయ‌కుడు.. టీడీపీకి వెన్నుపోటు పొడిచార‌ని.. నంద‌మూరి కుటుంబాన్ని ఎందుకు రానివ్వ‌డం లేద‌ని.. మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. బీఆర్ ఎస్ ఏపీలోకి అడుగులు వేసేందుకు రెడీ అయింది. త్వ‌ర‌లోనే ఏపీలో 5 రోజ‌లు పాటు మ‌హాస‌భ‌లు కూడా పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్ ఏపీకి వ‌స్తే.. త‌మ ఓటు బ్యాంకుకు న‌ష్టం జ‌రుగుతుంద‌నే బెంగ స‌హ‌జంగానే టీడీపీకి ఉంది. ఈ ప‌రిణామాలు ఇలా.. ఉంటే.. బీజేపీ తెలంగాణ‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు.. చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని కొంద‌రు అంటుంటే.. బీఆర్ ఎస్ నేత‌లు మాత్రం బీజేపీ ప్లాన్ ప్ర‌కార‌మే చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఇటు చంద్ర‌బాబు.. అటు కేసీఆర్‌ల రాజ‌కీయం రెండు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.