Begin typing your search above and press return to search.
ఏపీలో బీయారెస్...కేసీయార్ మిత్రులు వారే...?
By: Tupaki Desk | 11 Dec 2022 1:30 AM GMTమొత్తానికి తాను అనుకున్నట్లుగా జాతీయ పార్టీ అయితే పెట్టేసారు కేసీయార్. తెలంగాణా రాష్ట్ర సమితి అంటూ పార్టీ జెండా మధ్యలో ఇప్పటిదాకా ఉన్న తెలంగాణా రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి బ్యారత దేశం మ్యాప్ తగిలించారు. దాంతో బీయారెస్ అయిపోయింది. ఎటూ గులాబీ రంగు ఉంది. కారు గుర్తు కూడా ఉంది. దాంతో పెద్దగా శ్రమ అవసరం లేకుండా జాతీయ పార్టీగా ముందుకొచ్చింది.
మరి ఇక్కడితో సరా అంటే ముందుంది ముసళ్ళ పండుగ అని అంటున్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో తెలంగాణా రాష్ట్రం ఒక చిన్న రాష్ట్రం. ఎంపీలు 17 మంది మాత్రమే ఉన్నారు. పక్కన ఉన్న ఆంధ్రాకు పాతిక మాంది ఉంటే పొరుగున ఉన్న కర్నాటకకు 28 మంది, తమిళనాడుకు 39, కేరళాకు 20 మంది ఉన్నారు. మరి ఇంత తక్కువ నంబర్ తో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుదామంటే కుదిరే పనేనా అంటే అసలు కాదు.
మరి ఏం చేయాలి. 17 ప్లస్ 25 అంటే 42 నంబర్ తో గేమ్ స్టార్ట్ చేస్తే కొంత సబబుగా ఉంటుంది. అంటే కచ్చితంగా ఆంధ్రా వైపు చూడాలి. మరి ఆంధ్రాలో బీయారెస్ కి నేస్తాలు ఎవరు. ఏపీలో చూసే వామపక్షాలు తెలుగుదేశం వైపు చూస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు రెండూ బీయారెస్ కి ప్రత్యర్ధులే. చంద్రబాబు టీడీపీతో అసలు కుదరదు, జగన్ వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ సైతం టీడీపీ బీజేపీలను కలుపుకుని పోవాలని చూస్తున్నారు.
ఆ విధంగా ఆలోచన చేస్తే బీయారెస్ కి ఏపీలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి మిత్రుడు ఎవరూ కనిపించడంలేదు. పోనీ కామ్రేడ్స్ వస్తారా అంటే తెలంగాణాలో ఒకలా ఏపీలో మరోలా వారు వ్యవహరిస్తున్నారు. అయితే మునుగోడు తరువాత కామ్రేడ్స్ తో దోస్తీ కుదిరింది. అది ఏపీకి విస్తరిస్తుంది అనుకుంటే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితేనే సాధ్యపడుతుంది. అపుడు ఎటూ ఒంటరిగా పోటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కామ్రెడ్స్ బీయారెస్ వైపు చూసే అవకాశం ఉంటుంది అంటున్నారు.
ఇక మజ్లీస్ ని కూడా తనతో పాటే కలుపుకుని పోవాలని కేసీయార్ చూస్తున్నారు. ఏపీలో ముస్లిం పాపులేషన్ ఉన్న చోట్ల మజ్లీస్ పోటీ చేస్తూ కేసీయార్ బీయారెస్ తో కలసి ఎన్నికల గోదాలోకి దిగుతుంది అని అంటున్నారు. అంటే కుదిరితే కామ్రేడ్స్ మజ్లీస్, బీయారెస్ కూటమిగా ఏపీలో పోటీ చేస్తారని అంటున్నారు. ఇంతకు మించిన ఆప్షన్ అయితే లేదు. మరి ఇది ఏపీలో ప్రభావం చూపుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.
కామ్రేడ్స్ కి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. మజ్లీస్ ఇప్పటిదాకా పోటీ చేయలేదు, ఎక్కడ బావ అయినా వంగతోటలో కాదు అన్నట్లుగా బీయారెస్ ని ఏపీ జనాలు టీయారెస్ గానే చూస్తారు. పైగా అడ్డగోలు విభజన వల్ల దెబ్బతిన్నామని భావిస్తున్న ఏపీ ప్రజలు కేసీయార్ ని ఆయన పార్టీని పెద్దగా రిసీవ్ చేసుకుంటారని ఎవరూ ఈ రోజుకు అయితే అనుకోవడంలేదుట.
మరో వైపు చూస్తే కేసీయార్ కి ఈ విషయాలు అన్నీ బాగా తెలుసు. ఆయన కూడా రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్నవారే. అందువల్ల ఆయన కులం కార్డు తీస్తారని అంటున్నారు. మజ్లీస్ మతం కార్డు, కేసీయర్ కులం కార్డు రెండూ కలిస్తే విభజన అగ్గి చల్లారిపోయి ఎంతో కొంత ఓటింగ్ తమకు అనుకూలం అవుతుంది అని అంచనా కడుతున్నారుట. వెలమ సామాజికవర్గం ఉత్తరాంధ్రాలో గట్టిగా ఉంది. దాంతో ఆ వైపున ఒక వల విసరాలని భావిస్తున్న కేసీయార్, రాయలసీమ నుంచి ఒక బలమైన సామాజికవర్గాని తన వైపునకు సామదాన భేద దండోపాయల ద్వారా ఎంతో కొంత తిప్పుకుంటే గౌరవనీయమైన పోటీని ఇవ్వగలమని లెక్క కడుతున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా పేరు సెట్ అయింది. జెండా ఎగిరింది కానీ జాతీయ పార్టీగా పక్క రాష్ట్రం ఏపీలో బీయారెస్ రాజకీయ ప్రయాణం కానీ ప్ర్స్థానం కానీ అంత సులువుగా జరిగే అవకాశాలు అయితే లేవు అనే అంటున్నారు. మరి కేసీయార్ ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.