Begin typing your search above and press return to search.
దేశం దుస్థితి కాంగ్రెస్-బీజేపీలే కారణం.. కేసీఆర్ ఫైర్
By: Tupaki Desk | 18 Jan 2023 3:25 PM GMTఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ ఎస్ ఆవిర్భావ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందని.. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అని ప్రకటించారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని కేసీఆర్ పేర్కొన్నారు.
జలవనరులు, సాగు భూమి విషయంలో భారత్ అగ్రగామిగా ఉందన్న కేసీఆర్ అయినప్పటికీ.. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నామని, ఇది సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని లెక్కలు చెప్పారు.
జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని కేసీఆర్ అన్నారు. చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని పేర్కొన్నారు. కానీ దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అని ప్రశ్నించారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని కేసీఆర్ నిలదీశారు. కేంద్ర వైఖరి... చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట పెట్టినట్లుందిగా తయారైందని కేసీఆర్ విమర్శించారు.
దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందని.. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదని పేర్కొన్నారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.