Begin typing your search above and press return to search.
2024 తర్వాత మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి.. సమరశంఖం పూరించిన కేసీఆర్
By: Tupaki Desk | 18 Jan 2023 12:34 PM GMT2024 తర్వాత మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి అంటూ తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా మోడీని గద్దె దించడమే తన ధ్యేయమని కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని ఈ ప్రజలను చూస్తే తెలుస్తోందన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సబ అని కొనియాడారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు.
ఖమ్మం సభకు కేసీఆర్ తోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమన్నారు. జలవనరులు, సాగు భూమి విషయంలో మనదేశమే అగ్రగామి అన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని కానీ.. కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చూస్తోందని.. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందన్నారు. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా? అని ప్రశ్నించారు.రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందన్నారు.
కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గు చేటు అని.. రూ. లక్షల కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని.. దేశానికి నిర్ధిష్ట లక్ష్యం లేకుండా పోయిందని కేసీఆర్ విమర్శించారు.
దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ 4.10 లక్షల మెగా వాట్లు అని.. దేశం ఎప్పుడూ కూడా 2.10 లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదన్నారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని.. వీటన్నింటిని రూపు మాపేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు.
దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణం.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీను తిడుతోందని కేసీఆర్ ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ తిడుతుందని.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగులు భారత్ ను తయారు చేస్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మం సభలో జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయితీలకు రూ.10 లక్షల చొప్పున జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున , ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాన్నారు. 10వేల జనాభా దాటిన మేజర్ పంచాయితీలకు రూ.10 కోట్ల నిధులు కేటాయించారు. మున్నెరు వంతెన మంజూరు చేసి.. జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. ఖమ్మం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.