Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ సభకు వచ్చిన వాళ్లంతా గగ్గోలు

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:46 PM GMT
బీఆర్ఎస్ సభకు వచ్చిన వాళ్లంతా గగ్గోలు
X
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ బాగా జరిగింది. తెలంగాణ నుంచే కాదు.. ఏపీ నుంచి జనాలను తరలించారు. ఇందుకోసం కేసీఆర్ చాలా ఖర్చు చేశారు. మంత్రులు, ఏపీ నేతలు పూనుకున్నారు.

ఏపీ ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. వివిధ జిల్లాల నుంచి లక్షల మందిని రూ.300 నుంచి 500 చొప్పున ఇస్తామని నాయకులు తీసుకొచ్చారని.. తమకు చేతిలో రూ.100 పెట్టి చేతులు దులుపుకున్నారని సభకు వచ్చిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తాము రాము అని అన్నా.. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి మరీ సభకు తీసుకొచ్చారని.. రూ.300 ఇస్తామన్నారని.. కానీ రూ.100 రూపాయలు చేతిలో పెట్టి తమకు తాగేందుకు నీరు కూడా ఇవ్వలేదని సభకు వచ్చిన జనం ఆక్షేపించారు.

వచ్చేటప్పుడు మాత్రం తమకు బిర్యానీ పాకెట్లు ఇస్తామన్నారు. తినడానికి అన్నం కూడా పెట్టలేదన్నారు. ఇది న్యాయమేనా కేసీఆర్ సారూ అంటూ ప్రశ్నిస్తున్నారు. సభకు పిలిచి అన్నం కూడా పెట్టరా? ఇస్తామన్నా డబ్బులు కూడా ఇవ్వరా అని వాపోతున్నారు.

తమను తీసుకుపోవడానికి ఆటోలు పెట్టారని.. వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేదని మహిళలు వాపోయారు. అంతేకాదు.. మళ్లీ సభలు జరగవా? అప్పుడు వస్తమనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సభకు వచ్చిన వారి బాధలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐదు లక్షల మందిని దాకా తీసుకొద్దామని నేతలు భావించారు. లక్షల మంది వచ్చారు. వారికి రూ.300 చొప్పున ఆశ చూపారు. కానీ చివరకు బడ్జెట్ సర్ధలేక ఎత్తేశారు. ఇప్పుడు మహిళలు, సామాన్య ప్రజలంతా గగ్గోలు పెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.