Begin typing your search above and press return to search.

టోల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే దాడి

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:50 AM GMT
టోల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే దాడి
X
తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. త‌న కారుకు టోల్‌రుసుము చెల్లించ‌మ‌ని కోరిన టోల్ గేట్ సిబ్బందిపై ఆయ‌న దాడిచేసిన‌ట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మంచిర్యా ల జిల్లా మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. గత నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్‌ రుసుము వసూలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఎమ్మెల్యే వాహనం అక్కడకు చేరుకోగానే టోల్‌ప్లాజా సిబ్బంది టోల్ రుసుము చెల్లించాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో ఒకింత దురుసుగా వ్యవహరించారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్‌ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

నా త‌ప్పు లేదు:ఎమ్మెల్యే ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్న‌య్య‌ స్పందించారు. టోల్‌ప్లాజా సిబ్బందే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని స్పష్టం చేశారు. ''నేను ఎవరిపై దాడి చేయలేదు. రోడ్డు నిర్మాణం పూర్తి కాకున్నా టోల్ వసూల్ చేయడాన్ని ప్రశ్నించాను.

టోల్‌గేట్ సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంబులెన్స్‌లను కూడా ఆపేసి సతాయిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు.

నన్ను టోల్ ప్లాజా ఓపెనింగ్‌కు కూడా పిలవలేదు. రోడ్డును పూర్తి చేశాకే టోల్ వసూలు చేయాలి'' అని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.