Begin typing your search above and press return to search.
2024లో ఏపీలో బీయారెస్ కి డిపాజిట్లు వస్తాయా...?
By: Tupaki Desk | 10 Jan 2023 4:30 PM GMTభారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మీద కోపంతో జాతీయ రాజకీయ మీద మోజుతో కేసీయార్ ఏర్పాటు చేసుకున్నది. తనకు ఉన్న జాతీయ రాజకీయ ప్రేమను ఈ విధంగా తీర్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు. పేరు టీయారెస్ ని అలా మార్చేసారు. అక్కడ టీ బదులుగా బీ వచ్చి చేరింది. చూడబోతే ఇదంతా బాగానే ఉంది కానీ అంత మాత్రం చేతే ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఉన్నది కాస్తా జాతీయ పార్టీగా మారుతుందా. కానీ రాజకీయ నాయకులకు ఉన్న ఆశ వేరొకరికి ఉండదు అంటారు.
అందుకే కేసీయార్ బీయారెస్ అంటున్నారు. ఆయన ఏపీ మీద కూడా పేరాశ పెట్టుకున్నారు. ఏపీలో తెలుగు వారే ఉన్నారు. తన సొంత సామాజిక వర్గం ఉంది. తనకు తెలిసిన వారు ఉన్నారు. ఒకనాటి తన టీడీపీ రాజకీయ సహచరులు ఉన్నారు. ఇలా చాలా లెక్కలేసుకుని కేసీయార్ ఏపీలో బీయారెస్ జెండా పాతాలని అనుకుంటున్నారు.
కానీ ముందే చెప్పుకున్నట్లుగా అదంతా సులువా అంటే కానే కాదు అని అంటున్నారు. ఏపీలో జనాలు కేసీయార్ అంటే విభజనకు కారకుడు అనే చూస్తున్నారు. ఆయన టీయారెస్ కాదు బీయారెస్ అని అనవచ్చు కానీ ఏపీ జనాలకు మాత్రం అది కచ్చితంగా కేసీయార్ పార్టీ. అక్కడే కేసీయార్ కి అతి పెద్ద మైనస్ అవుతోంది అని అంటున్నారు. నిజానికి ఏపీ వాసులకు ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నుకుంటే వాటిలో ఏదో ఒక దాన్ని ఎన్నుకుంటారు. కానీ బీయారెస్ కి ఎందుకు చోటిస్తారు.
పొరుగు రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సంపన్న పార్టీ కాబట్టి హంగూ ఆర్భాటం ఉండవచ్చు గాక. అంతమాత్రం చేతే బీయారెస్ కి ఏపీలో ఓట్లు పడిపోతాయా. పక్కా తెలంగాణా వాదిగా కేసీయార్ ఉన్నారు. ఆయన సడెన్ గా జాతీయ వాది ఎలా అవుతారు అన్నది జనాల్లో ఉన్న డౌట్. ఇంకో మాట కూడా ఉంది. ఏపీ తెలంగాణాల మధ్యనే నీటి ఆస్తుల తగవులు ఉన్నాయి. మరి ఈ తగవుల విషయం తీసుకుంటే కేసీయార్ ఏ వైపు కొమ్ము కాస్తారు అంటే రెండవ మాట లేకుండా తెలంగాణాకే అని చెబుతారు.
ఇది ఏదో తమాషాకు అంటున్న మాట కాదు. కేసీయార్ మార్క్ తెలంగాణవాదాన్ని కరడు కట్టిన నినాదాన్ని పూర్తిగా చూసిన వారు అనే మాట. అందువల్ల కేసీయార్ బీయారెస్ కి ఏపీలో పెద్దగా వేళ్ళూనుకునేద్నుకు చోటు ఉండదు అనే అంటున్నారు. ఇక కేసీయార్ డబ్బులు ఇచ్చి చాలా మందిని అభ్యర్ధులుగా నిలబెట్టవచ్చు. అలాగే చాలా మంది ఆయన పార్టీలో చేరవచ్చు. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులకు ఏపీలో కొదవ లేదు కాబట్టి.
అందువల్ల పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరుకుతారు కానీ డిపాజిట్లు అయినా వస్తాయా అన్నదే ఇక్కడ ప్రశ్న. కానీ కష్టమే అన్న వారూ ఉన్నారు. ఒక్కో నియోజకవరంలో రెండు లక్షలకు పైగా ఓట్లు ఉంటాయి. అందులో లక్షన్నకు పైగా పోల్ అవుతాయి. అందులో పది నుంచి పదిహేను వేల ఓట్లు అయినా బీయారెస్ తెచ్చుకోకపోతే డిపాజిట్లు దక్కవు. ఇపుడు చూస్తే ఆ పరిస్థితి అయితే లేనే లేదు అని అంటున్నారు.
అన్నేసి ఓట్లు కనుక బీయారెస్ కి వస్తే ఇంతటి టైట్ ఫైట్ లో ఆ పార్టీని కూడా ఒక బలమైన శక్తిగా చూస్తారు అనే అంటున్నారు. ఇక కేసీయార్ బీయారెస్ పెట్టడం వెనక లక్ష్యం ఏంటో అందరికీ తెలుసు అని అంటున్నారు. ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా చేసుకోవాలని అనుకుంటున్నాడు అంటే కేసీయార్ బాధ ఆంధ్రా బాధ కాదు జాతీయ బాధ.
మరి ఆయన బాధలో చేరి ఓదార్చడానికి ఆంధ్రులు ఏమైనా తెలివి తక్కువ వారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ఆర్భాటం ఎక్కువ హడావుడి ఎక్కువ అసలు తక్కువ అన్నట్లుగానే ఏపీలో బీయారెస్ వ్యవహారం ఉంటుందని ఈ రోజుకు అందుతున్న విశ్లేషణ. మరి బీయారెస్ ఏదైన బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటే అపుడు సమీకరణలలో మార్పులు వచ్చినా రావచ్చేమో చూడాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.