Begin typing your search above and press return to search.
జెండా మోసి, జేజేలు కొట్టిన మా గతేంటి?
By: Tupaki Desk | 21 Jan 2023 3:22 AM GMTరాజకీయాల్లో పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందనేది చెప్పడం కష్టం. 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన చాలా మంది నాయకులు తర్వాత కారెక్కి షికారు చేశారు. అయితే.. ఈ పరిణామం అధికార పార్టీకి బాగున్నా ఆ పార్టీని నమ్ముకున్నవారు గరంగరంగా ఉన్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు మొత్తంగా 15కు పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికార బీఆర్ ఎస్‌లో అసంతృప్తులు పెరుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ గెలిచిన స్థానాల నుంచి ఆయా నేతలను బీఆర్ ఎస్‌లోకి కేసీఆర్ ఆహ్వానించారు.
తద్వారా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలనేది ఆయన భావన. రాజకీయంగా ఈ వ్యూహం సక్సెస్ అవుతుందని భావించారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ప్లేట్ తిరగబడే పరిస్థితి వచ్చింది.
ఇలా వచ్చిన వారికి టికెట్‌లు ఇస్తే.. ఇప్పటి వరకు జెండా మోసిన, జేజేలు కొట్టిన మా గతేంటని ఓడిపోయి న నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన తమ ప్రభావం తగ్గిపోయిందని.. తగ్గిపోతుం దని ఎలా భావిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా నిజమే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఎవరి ప్రభావం తగ్గిపోతుందని చెప్పలేం. ఈ ధైర్యమే నాయకులను ముందుకు నడిపిస్తోంది.
ఇది బీఆర్ ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఓడిపోయిన వారిని ఇటు కాంగ్రెస్సో.. అటు బీజేపీనో.. అక్కున చేర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి.
ఇదే జరిగి.. బీఆర్ ఎస్ వారిని కనుక ఉపేక్షిస్తే.. కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ గట్టి పోటీ ఎదుర్కొనడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం.. అధికార పార్టీని ఇరుకున పడేసే పరిస్థితి ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.