Begin typing your search above and press return to search.
ఖమ్మం గుమ్మంలో బీయారెస్... పక్కా ప్లాన్ తో గులాబీ బాస్
By: Tupaki Desk | 17 Jan 2023 9:50 AM GMTఖమ్మంలో భారీ ఎత్తున బీయారెస్ ఆవిర్భావ సభను జరపాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. అసలే అధికారంలో ఉన్న పార్టీ. పైగా కసి తోడు అయింది. అందుకే నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా కేసీయార్ ఖమ్మంలో సభను నిర్వహించాలని చూస్తున్నారు. అయిదు లక్షల మంది జనాలతో వంద ఎకరాల సువిశాల స్థలంలో ఈ సభను నిర్వహించబోతున్నారు. నలుగురు సీఎంలు ఈ సభకు వస్తున్నారు. కేసీయార్ జాతీయ రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కరణ ఇక్కడే జరగనుంది.
నిజానికి బీయారెస్ పార్టీ లాంచింగ్ పాడ్ లాంటి సభను అచ్చి వచ్చిన చోట నిర్వహిస్తారు. కానీ వెరైటీగా కేసీయార్ ఏనాడు తమ పార్టీ ముఖం చూడని ఖమ్మంలో నిర్వహించడమేంటి అన్న చర్చ వస్తోంది. టీయారెస్ తెలంగాణాలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఖమ్మంలో ఒకటి రెండు సీట్లకు మించి దక్కింది లేదు. అంటే ఖమ్మం ఎపుడూ గులాబీ పార్టీని అక్కున చేర్చుకోలేదు అనే చెప్పాలి.
ఇక ఖమ్మంలో ఆది నుంచి కమ్యూనిస్టులకు ప్రాబల్యం ఉంది. వారికి మంచి పట్టు ఉన్న జిల్లాగా చెబుతారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా ఖమ్మంలో మంచి విజయాలను సాధించింది. కాంగ్రెస్ నుంచి వేరుపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తరువాత 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ఎంపీ మూడు ఎమ్మెల్యే సీట్లు జగన్ పార్టీకి ఖమ్మంలోనే దక్కాయీ అంటే ఖమ్మం రాజకీయం ఏంటో చెప్పాల్సిన పని లేదు.
వైఎస్సార్ మీద అభిమానం తనను గెలిపిస్తుంది అని వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల కూడా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా గత నెలలో ఖమ్మంలోనే భారీ సభను పెట్టడం ద్వారా తెలంగాణాలో రీ ఎంట్రీ ఇవాలని చూస్తున్నారు. బాబు సభ కూడా సూపర్ హిట్ అయింది.
ఇలా అన్ని పార్టీలు ఇపుడు ఖమ్మం మీదనే దృష్టి పెట్టాయని చెప్పాలి. ఖమ్మం విశేషం ఏంటి అంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. పైగా అటు ఆంధ్రా ఇటు చత్తీస్ ఘడ్ లతో పాటు తెలంగాణా రాజకీయం కలసిన ప్రాంతం ఖమ్మం. దాంతో ఇక్కడ ప్రజల మీద మూడు రాష్ట్రాల ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. ఖమ్మంలో మరో కీలకమైన విషయం ఏంటి అంటే రాజకీయంగా అత్యంత కీలకమైన జిల్లాగా చెప్పుకుంటారు.
ఇక్కడ ప్రధాన సామాజికవర్గాలు రాజకీయాలను శాసిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కనుక పట్టు సాధిస్తే జాతీయ పార్టీగా బీయారెస్ కి ఎదురు ఉండదు అన్న ఆలోచనతోనే కేసీయార్ ఖమ్మాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఖమ్మం సభ సూపర్ సక్సెస్ కోసం బీయారెస్ నేతలు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు అనే చెప్పాలి.
అలాగే ఖమ్మంలో పట్టున్న కమ్యూనిస్టులను కూడా మిత్రులుగా బీయారెస్ చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ఖమ్మం జిల్లాలో వారికి చేరి మూడేసి సీట్లు వంతున ఇవ్వాల్ని కూడా అనుకుంటోంది. దానికి బదులుగా ఖమ్మం జిల్లాను బీయారెస్ కి కంచుకోటగా చేసుకోవాలని కూడా ఆశపడుతోంది. అన్నీ ఆలోచించే కేసీయార్ ఖమ్మం వేదికగా ఎంచుకున్నారు అని అంటున్నారు.
బీయారెస్ కి పట్టు తక్కువ ఉన్న ఖమ్మం నుంచే రాజకీయ రణభేరీని మోగిస్తే కనుక అది చేసే రీసౌండ్ ప్రత్యర్హ్ధులకు షాకింగ్ గా మారుతుంది అని గులాబీ బాస్ ఊహిస్తున్నారు. అలాగే ఖమ్మం నుంచే తమ రాజకీయ జాతకాన్ని మార్చుకోవాలని చూస్తున్న విపక్షానికి కూడా చెక్ చెప్పడం కోసమే ఆయన ఈ జిల్లాను సెలెక్ట్ చేశారు అని అంటున్నారు. మరి ఖమ్మం బీయారెస్ కి ఎలాంటి నీరాజనం పడుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.