Begin typing your search above and press return to search.

ట్రంప్ చెప్పాడని ఆ పని చేశాడు.. అరెస్టయ్యాడు

By:  Tupaki Desk   |   25 Oct 2018 1:30 AM GMT
ట్రంప్ చెప్పాడని ఆ పని చేశాడు.. అరెస్టయ్యాడు
X
విమానంలో పాడు పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయాడో యువకుడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, అతను చెప్పిన మాటలకు విస్తుపోవడం వారి వంతయ్యింది. ట్రంప్ చెప్పినందు వల్లే ఈ పనిచేశానని అన్నాడు. అసలు విషయమేమిటంటే..

హుస్టన్ నుంచి అల్బుకర్ కు వెళ్తున్న విమానంలో బ్రూస్ అలెగ్జాండర్ అనే వ్యక్తి తన ముందు కూర్చున్న మహిళపై కన్నేశాడు. విమానం గాల్లోకి ఎగరగానే ఆమె నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా మెల్లగా తన చేతిని ఆమె టీషర్టులో పెట్టి బ్రెస్ట్ ను తాకేందుకు ప్రయత్నం చేశాడు. ఏదో జారుతున్నట్లు అనిపించిన ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. వెంటనే చేయి తీసేయడంతో ఏదో అనుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంది. మరలా అలెగ్జాండర్ అదే పనిచేయబోయాడు. అడ్డంగా బుక్కయ్యాడు.

వెంటనే ఆమె పెద్ద రాద్ధాంతమే చేసింది. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. విమానం ల్యాండ్ అవగానే పోలీసులు అలెగ్జాండర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మాట్లాడుతూ ట్రంప్ చెప్పిన మాటలను గుర్తుచేశాడు.. ‘‘నువ్వు స్టార్ అయితే ఏమి చేసినా తప్పులేదు. అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకవచ్చు. ముద్దాడినా తప్పు కాదు’’ అని ట్రంప్ చెప్పాడని.. అందుకే తాను అలా చేశానని చెప్పుకొచ్చాడు..

నిజానికి ఇవి 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుు బయటకొచ్చిన ట్రంప్ కు సంబంధించిన ఓ ఆడియో టేపులోని మాటల సారాంశం. ట్రంప్ గొంతుతో ఉన్న ఆ టేపులు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. ఇప్పడు అలెగ్జాండర్ మరోసారి ట్రంప్ చెప్పినట్లుగా తాను చేశానని.. తన తప్పులేదంటూ ఆ ఆడియో టేపులోని అంశాలను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.