Begin typing your search above and press return to search.
బ్రస్సెల్స్ మానవబాంబు చివరి మెసేజ్..?
By: Tupaki Desk | 24 March 2016 5:10 AM GMTబెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వణికించి.. ప్రపంచానికి కలవరపాటుకు గురి చేసిన ఉగ్రదాడికి సంబంధించి ఒక కీలకాంశాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. వరుస బాంబుపేలుళ్ల అనంతరం.. బ్రస్సెల్స్ నగరాన్ని పోలీసులు జల్లెడ వేయటం.. పేలని బాంబును చెత్తకుండీ నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో ఒక కంప్యూటర్ ను గుర్తించారు. ధాని ఆధారంగా చేపట్టిన సోదాలతో ఉగ్రవాదులు నివాసం ఉన్న ఇంటిని గుర్తించటమే కాదు.. వారి ఇంట్లో బాంబు తయారీకి అవసరమైన పేలుడు పదార్థాల్ని.. ఐసిస్ జెండాల్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం.
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్.. మెట్రో మీద ఆత్మాహుతికి పాల్పడిన ఖలీద్.. ఇబ్రహీం సోదరులుగా గుర్తించారు. ఇక.. వీరితో ఉన్న మూడో వ్యక్తిని వరల్డ్ మోస్ట్ వాంటెడ్ బాంబ్ ఎక్స్ పర్ట్ నిజ్జమ్ లాచ్రోయ్ గా భావిస్తున్నారు. బాంబుపేలుళ్లకు కొద్దిసేపటి ముందు.. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు పంపిన మెసేజ్ చూస్తే.. ‘‘నాకేం చేయాలో తోచటం లేదు. ప్రతి చోటా పోలీసులు గాలిస్తున్నారు. ఇక.. ఏ మాత్రం భద్రంగా ఉండలేం. నేను అతనిలా జైల్లో ఉండాలనుకోవటం లేదు. ఏదో ఒకటి చేయాల్సిందే’’ అంటూ ఇబ్రహీం సందేశాన్ని పంపినట్లుగా గుర్తించారు. మరి.. ఈ సందేశం ఎక్కడికి.. ఎవరికి పంపారన్నది ఒక ప్రశ్న అయితే.. వీరి ఇంటి నుంచి సేకరించిన భారీ బాంబు తయారీ సామాగ్రి విస్మయానికి గురి చేస్తోంది.
ఆత్మాహుతి సభ్యులు నివాసం ఉన్న ఇంటి నుంచి 15 కేజీల టీఏటీపీ పేలుడు పదార్థం.. 150 లీటర్ల ఎసిటోన్.. 30 లీటర్ల ఆక్సిజన్.. డిటోనేటర్లు..సూట్ కేస్ నిండా మేకులు.. బాంబుల తయారీకి అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున బాంబు తయారీ సామాగ్రిని గుట్టుచప్పుడు కాకుండా ఎలా తరలించారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.