Begin typing your search above and press return to search.
బ్రతికుండగానే కళ్లు పీకి - ఆరేళ్ల చిన్నారి పై అఘాయిత్యం!
By: Tupaki Desk | 23 April 2020 5:30 PM GMTకరోనా మహమ్మారి వంటి ప్రాణాంత వ్యాధులు వచ్చి ప్రజలు పిట్టల్లారాలిపోతున్నా కూడా కొందరు రాక్షసులలో ఏమాత్రం మార్పురాలేదు. తాజాగా ఒక మనిషి రూపంలో ఉండే మానవ మృగం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయటమే కాకుండా బ్రతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా, క్రూరంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్లోని దామోలో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్నేహితులతో కలిసి ఇంటికి కొద్ది దూరంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి చిన్నారిని తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి పాప కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు వెదకటం మొదలుపెట్టారు. అయినా ఆ పాప జాడ కనిపించలేదు. అయితే , గురువారం ఉదయం ఇంటికి దూరంగా తీవ్రగాయాలతో పడి ఉన్న పాపను వారు గుర్తించారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సీనియర్ పోలీసు అధికారి హేమంత్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారం చేశాడు. కళ్ల దగ్గర కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామని, నిందితుడిని పట్టుకునే పనిలో వున్నామని , కచ్చితంగా నిందుతుడిని పట్టుకుంటామని చెప్పుకొచ్చారు.