Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లోనూ 10ఏళ్ల బాలికపై అత్యాచారం
By: Tupaki Desk | 25 April 2020 9:50 AM GMTలాక్ డౌన్ ఇంత కఠినంగా అమలవుతున్నా దేశంలో కామాంధుల చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ఇటీవలే హైదరాబాద్ లో 10 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనమైంది. ఇది మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన అభుశుభం తెలియని 10 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మరియానందం అనే 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది.
బాలిక తండ్రి మూడేళ్ల కిందటే చనిపోగా.. బాలిక తల్లి కూలీ పనిచేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకుని పోషిస్తోంది. తాజాగా తల్లితోపాటు మిగతా వారు మిర్చి కోత పనికి వెళ్లగా 10 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇదే అదునుగా భావించిన మరియానందం బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తల్లికి బాలిక ఈ విషయం చెప్పి బోరుమంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మరియానందంను అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.