Begin typing your search above and press return to search.

తాలిబన్ల క్రూరమైన చట్టాలివీ

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:30 AM GMT
తాలిబన్ల క్రూరమైన చట్టాలివీ
X
అప్ఘనిస్తాన్ లో ఇప్పుడు ప్రజాస్వామ్యం కూనరిల్లి తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. దీంతో అక్కడ బతకలేమనిచాలా మంది విదేశాలకు పారిపోతున్నారు. ఇక ఆదేశంలోని మహిళ పరిస్థితి దుర్భరంగా తయారైంది. మహిళల పట్ల తాలిబన్లు విధించే చట్టాల గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఈ చట్టాలతో మహిళల స్వేచ్ఛ హరించడం ఖాయంగా కనిపిస్తోంది.

-తాలిబన్ల షరియా చట్టాలు, వాటి అమలు1
తాలిబన్లు అధికారంలోకి వస్తే షరియా చట్టాలను అమలు చేస్తారని అప్ఘన్ ప్రజలు భయపడుతున్నారు. నిజానికి షరియా అంటే మార్గం.. నీటి ప్రవాహ మార్గం అనే అర్థాలున్నాయి. ఇది అరబ్బీ పదం. షరియా న్యాయపరమైన హద్దులు గల మార్గం. సామాజిక, వ్యక్తిగత జీవితాలను ఇది నిర్ధేశిస్తుంది. తప్పు చేసిన వారికి షరియా చట్టం ప్రకారం శిక్షలు వేస్తారు.

-తాలిబన్ల షరియా చట్టాలు, వాటి అమలు2
అప్ఘనిస్తాన్ ను పాలించిన తాలిబన్లు షరియా చట్టాల ప్రకారం విధించిన శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. హంతకులను అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ , పురుషఉలను బహిరంగంగా తలలు నరకడం.. లేదా ఉరితీయడం చేశారు. చోరీలకు పాల్పడితే కాళ్లు చేతులు నికారు. కొన్ని సార్లు రెండంచెల శిక్ష విధానం అమలు చేశారు. మొదటి దశలో హెచ్చరించి రెండో దశలో తీవ్రమైన శిక్షలు వేశారు.

-తాలిబన్ల షరియా చట్టాలు, వాటి అమలు3
షరియా చట్టాల ప్రకారం పురుషులకు గడ్డాలు, స్త్రీలకు బురఖాలు తప్పనిసరి. పదేళ్లు పైబడిన బాలికలు బడులకు వెళ్లకూడదు. సంగీతం, టీవీ, సినిమాలూ నిషేధం. మహిళలు బయటకు వెళ్లాలంటే తోడుగా మగవారు ఉండాలి. ఏ విద్య అయినా ఇస్తామిక్ షరియా చట్టాలకు లోబడి ఉండాల్సిందే.. ప్రతి శుక్రవారం ప్రజలు చేసుకునే పార్టీలు నిషేధం.

ఆడవారు ఒంటరిగా ఇంటినుంచి బయటకు రాకూడదు. తోడుగా ఒక పురుషుడు ఉండాల్సిందే. పురుషుడు స్త్రీతో రక్త సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఆమె భర్త, తండ్రి, సోదరుడు లేదా కుమారుడు అయ్యి ఉండాలి. స్త్రీలు పురుషేతరుడితో కలిసి తిరగరాదు. కాలి నుంచి చేతి వరకు శరీరంలోని ఏ భాగం కూడా కనిపించకుండా బురఖా వేసుకోవాలి.

ఇక మహిళలు హైహీల్స్ ధరించలేరు. ఎందుకంటే ఆమె మడమలు ధరించిన తర్వాత నడుస్తుంటే ఆమె అడుగుజాడల శబ్ధం వస్తుంది. మహిళలు పాదాలకు ఏం ధరించాలో కూడా తాలిబన్లే నిర్ణయిస్తారు.

మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు. కనీసం బహిరంగ ప్రదేశంలో పెద్దగా మాట్లాడకూడదు. ఎనిమిదేళ్ల తర్వాత బాలికలు చదవడానికి అనుమతించరు. ఇక మహిళలు కిటీకీలోంచి చూడకుండా రంగులు వేస్తారు. మహిళలు వీడియోలు, సినిమాలు చేయకూడదు. వార్తపత్రికలు, పుస్తకాలు ఇళ్లలో ఉంచకూడదు. పురుషులు సైతం తమ భార్య ఫొటోను ఫోన్ లో ఉంచుకోకూడదు. తాలిబన్ నిబంధనలకు ఇది విరుద్ధం.

మహిళలు రేడియో, టీవీలలో పనిచేయకూడదు. బహిరంగ సమావేశానికి రాకూడదు. సైకిల్, మోటార్ సైకిల్ నడుపకూడదు. మహిళలు బస్సుల్లోనూ ప్రయాణించకూడదు. ప్రత్యేక మహిళా బస్సులను ఏర్పాటు చేశారు.తాలిబాన్ పాలనలో మహిళలు ఇంటి లేదా అపార్ట్ మెంట్ బాల్కనీలో నిలబడకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు వేస్తారు.అవసరమైతే ప్రాణ, మానాలు తాలిబన్లు తీసేస్తారు.

ప్రస్తుతం తాలిబన్లు అక్కడి వీధుల్లో మహిళలున్న ఫొటోలు, మహిళా అనుకూల యాడ్ ఫొటోలను పెయింటింగ్ వేసి తీసివేస్తున్నారు. మొత్తంగా మహిళలు బయటకు రాకుండా తాలిబన్లు వారిని బంధీలుగా, బానిసన్లుగా చేస్తున్నారన్నమాట.