Begin typing your search above and press return to search.

చంపి దీపంపెట్టి.. చేతి, కాళ్ల గోర్లు ఎత్తుకెళ్లారు

By:  Tupaki Desk   |   10 March 2020 11:00 PM IST
చంపి దీపంపెట్టి.. చేతి, కాళ్ల గోర్లు ఎత్తుకెళ్లారు
X
నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళను అతి కిరాతకంగా చంపేశారు. మంత్రాల నెపమో లేక మరేదైనా తాంత్రిక పూజలో ఏమో కానీ అత్యంత భీతావాహంగా చంపేసి ఆమె చేతి గోర్లు, కాలివేళ్లు నరుక్కువెళ్లడం కలకలం రేపింది.

నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ లో ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ అనే వివాహితను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఇంట్లోని సోఫాలో కూర్చొని ఉండగా.. ఆమె ను దుండగులు నరికి చంపారు.

చంపాక కూడా ఆ మృతదేహాన్ని హంతకులు వదలలేదు. మృతదేహం ముందు దీపాలు పెట్టి ఇంట్లో డాగ్ స్క్వాడ్ కు దొరకకుండా కారం, పసుపు చల్లి భయాన వాతావరణం సృష్టించారు.

ఇక మృతదేహానికి సంబంధించిన కాలివేళ్లు, చేతి గోర్లు కూడా నరికి మాయం చేయడం కలకలం రేపింది దారుణంగా హత్య చేసిన దుండగులు ఎవరనేది పోలీసులు ఆరాతీస్తున్నారు. నిన్న రాత్రి ఈ దారుణం జరిగింది.

అయితే ఇంట్లోని 5 తులాల బంగారం మాయం కావడం తో దొంగల పని అని భావిస్తున్నారు.

అయితే దీపం పెట్టడం.. కాలి, చేతి వేర్లు కట్ చేసి ఉండడడం తో మహిళకు మంత్రాలు వస్తాయనే ఇలా చంపి తమకు ముప్పు రాకుండా కొందరు చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.