Begin typing your search above and press return to search.
స్వామీజీ వార్నింగ్ తో రాజీనామా చేస్తానంటున్న ఆ సీఎం
By: Tupaki Desk | 15 Jan 2020 6:20 AM GMTముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది కూడా కాక ముందే కర్ణాటక బీజేపీ సీఎం యడ్యూరప్పకు పదవీ గండం పొంచి ఉందా? అంటే అవునని చెబుతున్నారు. మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా హెచ్చరిస్తున్న స్వామీజీ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆయన తన ముఖ్యమంత్రి పదవిని వదిలేసేందుకు రెఢీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఒక స్వామీజీ సీఎంకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. యడ్డీ సామాజిక వర్గమైన లింగాయిత్ లలో పలుకుబడి ఉన్న స్వామీ వచానంద్. ఆయన ముఖ్యమంత్రి యడ్డీ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్ కు మంత్రి పదవి ఇవ్వాలని లేదంటే లింగాయిత్ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఓపెన్ గానే హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సదరు స్వామీజీ.. యడ్డీకి వార్నింగ్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. మంత్రివర్గ విస్తరణ అన్నది యడ్డీ చేతిలో లేదు. దీంతో..అధిష్ఠానానికి చెప్పుకోలేదు.. అదే సమయంలో స్వామీజీకి సర్దిచెప్పుకోలేక కిందామీదా పడుతున్నారు. తన పరిస్థితిని వివరించి.. తనకుసహకరించాలని లేదంటే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని యడ్డీ హెచ్చరిస్తున్నారు. మరి.. సీఎం మీద స్వామీజీ దయతలుస్తారో.. లేక తన ఒత్తిడిని మరింత పెంచుతారో చూడాలి.