Begin typing your search above and press return to search.
నితీశ్ దెబ్బకు 600 పాయింట్లు పడింది
By: Tupaki Desk | 9 Nov 2015 5:23 AM GMTబీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం మోడీ అండ్ కో మీద ఎంత ప్రభావం ఉందో తెలీదు కానీ.. స్టాక్ మార్కెట్ మీద మాత్రం తీవ్ర ప్రభావం చూపించింది. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి ప్రతికూలంగా రావటమే కాదు.. లౌకిక కూటమి అద్భుత విజయం సాధించటంతో సోమవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం ట్రేడింగ్ షురూ అయిన కాసేపటికే 600 పాయింట్ల మేర భారీగా నష్టపోయింది. ఈ భారీ కుదుపునకు స్టాక్ మార్కెట్ అతలాకుతలమైంది.
కాసేపటికి కోలుకొని కొద్ది మేర రికవరీ అయినట్లు కనిపిస్తున్నా.. ధన త్రయోదశి రోజున సెన్సెక్స్ భారీ కోతకు గురి కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. బిహార్ పరాజయం సెంటిమెంట్ ను దెబ్బ తీయటమే కాదు.. మోడీ ఛరిష్మా మీద భారీ ప్రభావం చూపిస్తుందని.. దీని కారణంగా ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు చోటు చేసుకునే వీలుందన్న అంచనాలే ఈ భారీ పతనానికి కారణంగా చెబుతున్నారు.
ఈ రోజు ఇప్పటి వరకూ సెన్సెక్స్ కోల్పోయిన పాయింట్లతో దాదాపు రూ.లక్ష కోట్ల మేర మదుపరుల సొమ్ము అవిరి అయ్యిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సెన్సెక్స్ ఇంత భారీగా పతనమైతే.. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక.. డాలరుతో రూపాయి మారక విలువ 62 పైసలు మేరకు తగ్గిపోయింది. చూస్తుంటే.. బీహార్ లో మోడీ పరివారం ఘోర పరాజయం భారీ నష్టాన్నే మిగిల్చనుందన్న అభిప్రాయం మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఇదంతా తాత్కలికమని.. మార్కెట్ మళ్లీ కోలుకోవటం ఖాయమంటున్నారు.