Begin typing your search above and press return to search.
మోడీ అర్జెంట్ గా చూడాల్సిన వీడియో వచ్చేసింది
By: Tupaki Desk | 9 Jan 2017 9:03 PM ISTప్రధాని కుర్చీలో మోడీ కానీ కూర్చుంటే మొత్తంగా మారిపోతుంది. ప్రతిదీ ఛేంజ్ అయిపోతుందన్న కబుర్లు చెప్పినోళ్లు ఎంతోమంది. ఇంత పెద్ద వ్యవస్థలో మార్పుఒక్క మోడీతోనే మార్పు సాధ్యం కాదని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. వారిని పిచ్చోడి కింద జమ కట్టి చూసే వారు తప్పించి.. అందులోని నిజాన్ని అస్సలు పట్టించుకునే వారు కాదు. తాజాగా విడుదలైన ఒక వీడియో గురించి వివరాలు తెలిసిన వెంటనే.. ప్రధాని మోడీ గుర్తుకు రావటమే కాదు.. ఈ వీడియోను ఆయనకు చూపించి.. స్పందించమని కోరాలనిపించటం ఖాయం.
పండగలకు.. పబ్బాలకు సైన్యం వద్దకు వెళ్లటం.. వారితో పండగలు గడిపే ప్రధాని..వారి ఈతి బాధల మీదా.. సైన్యంలో నెలకొన్న అవినీతిపై ఫోకస్ చేశారా? అన్నడౌట్ రాక మానదు. దేశంలో మిగిలిన వ్యవస్థల్లో ఎలా అయితే.. అవినీతి ఉందోఅంతే స్థాయిలో డిఫెన్స్ లోనూ అవినీతి ఉందన్న విషయాన్ని చెబుతుంటారు. కానీ.. అందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాలేదని చెప్పాలి. ఇదిలాఉంటే.. సైన్యం ఎదుర్కొనే అసలుసిసలు కష్టాల్ని ఒక జవాను ధైర్యం చేసి దేశప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
సైన్యంలో ఉద్యోగాన్ని సంపాదించటం నిజంగానే అదృష్టమైనప్పటికీ.. అందులో ఉండే రియల్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని ఓపెన్ గా పంచుకున్నారు.. జమ్ముకశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్ కి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు. ఏ నిమిషాన శత్రువు విరుచుకుపడతారో తెలీని పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయమన్నట్లుగా డ్యూటీ చేసే సైనికులకు కల్పిస్తునన వసతులపై తేజ్ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు.
డ్యూటీలో ఎంత కష్టమైనా పడతాం కానీ.. పెరిగిన అవినీతి కారణంగా తమకు సరైన ఆహారం దొరకటం లేదన్న చేదు నిజాన్ని వీడియోలో వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులకు ఫలానా వారు కారణంగా చెప్పని తేజ్.. జవాన్లకు కల్పించాల్సిన సౌకర్యాలపై మాత్రం అసంతృప్తిని వ్యక్తంచేస్తూ.. సౌకర్యాల లేమి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మాడిపోయిన రోటీని.. నీళ్ల మాదిరి ఉండే టీని చూపించారు. పది గంటల పాటు డ్యూటీ చేసిన తర్వాత పసుపు.. ఉప్పు కలిపిన సూప్ తాగుతూ బతికేస్తున్నామన్న ఆయన.. తమ కష్టాలు.. పెరుగుతున్న అవినీతిని సరిదిద్దాలని కోరుతున్నారు. సగటు సైనికుడు పడుతున్న కష్టాలపై మోడీ అప్ డేట్ అయితే బాగుండన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/