Begin typing your search above and press return to search.

సైనికుల ఆరోప‌ణ‌..మ‌ద్యం అమ్ముకుంటున్నారు

By:  Tupaki Desk   |   29 Jan 2017 10:17 AM GMT
సైనికుల ఆరోప‌ణ‌..మ‌ద్యం అమ్ముకుంటున్నారు
X

స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప‌గ‌లు - రాత్రి తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్న సైనికులు త‌మ‌కు ఎదుర‌వుతున్న ఇక్క‌ట్ల గురించి ఇటీవ‌లి వ‌రుస‌గా వెళ్ల‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. సైనికులకు కేటాయించిన మద్యం బయటి వారికి అమ్ముతున్నారని ఆ రోపిస్తూ తీసిన వీడియోను ఒక బీఎస్‌ ఎఫ్ క్లర్క్ ఈ నెల 26న ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేశారు. అవినీతిపై తన ఫిర్యాదును పక్కన పెట్టారని స‌దరు జ‌వాన్ ఆరోపించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఏకంగా సంబంధిత అధికారులు స్పందించే వ‌ర‌కు చేరింది.

రాజస్థాన్‌ లోని బికనీర్ వాసి అయిన నవరతన్ చౌదరి ఆర్మీ సైనికుడిగా ఎంపిక‌య్యారు. గుజరాత్ లోని కచ్ జిల్లా గాంధీధామ్‌ లోని బీఎస్‌ ఎఫ్ 150వ బెటాలియన్‌ లో క్లర్క్‌ గా పనిచేస్తున్నారు. త‌మ కార్య‌క్షేత్రంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను తాజాగా ఆయ‌న వీడియె రూపంలో వెల్ల‌డించడం, అది వైర‌ల్ గా మార‌డంతో ఉన్న‌తాధికారులు స్పందించారు. అయితే ఎప్ప‌ట్లాగే రొడ్డ‌కొట్టుడు రిప్లై ఇచ్చారు. #చౌదరి తరుచూ నిరాధార ఆరోపణలు చేస్తారు. ఆయన సెలవులో ఉన్నప్పుడు తీసిన వీడియోను అప్‌ లోడ్ చేశాడు. చౌదరి ఫిర్యాదు పరిశీలనకు కమిటీని వేస్తాం అని ఓ అధికారి తెలిపారు.

ఇదిలాఉండ‌గా...హిమపాతం కారణంగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మచిల్ సెక్టార్‌ లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సైనికులు శనివారం మంచులో కూరుకుపోయారు. వెంటనే సహాయ చర్యలను చేపట్టిన సైన్యం వారిని రక్షించి దవాఖానకు తరలించింది. ఈ ఐదుగురు సైనికులు 56 రాష్ట్రీయ రైఫిల్స్‌ కు చెందినవారు. ఇప్పటికే కశ్మీర్‌ లోయలో హిమపాతం కారణంగా 15 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు పెద్ద ఎత్తున హిమపాతాలు చోటుచేసుకొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మంచు కారణంగా శ్రీనగర్-జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిని వరుసగా ఐదోరోజు కూడా మూసివేశారు. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో జాతీయ రహదారి వెంట పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో కశ్మీర్‌ లోయలో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/