Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కే బీఎస్పీ మద్దతు.. ఎంపీలో బీజేపీ ఔట్
By: Tupaki Desk | 12 Dec 2018 8:06 AM GMTహోరాహోరీగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ కు ఇరుపార్టీలు కొంత దూరంలో ఆగిపోయాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 115 సీట్లు రాగా బీజేపీ 108 స్థానాలు వచ్చాయి. దాదాపు 21గంటలకు పైగా కొనసాగిన కౌంటింగ్ లో ప్రతి రౌండ్లో సమీకరణాలు మారుతూ వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 230 స్థానాలకు జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా 36,422 మాత్రమే. అంటే పోలింగ్ పోటాపోటీగా జరిగిందని భావించాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 116. అయితే రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో విఫలమయ్యారు. దీంత్ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ప్రభుత్వ ఏర్పాటులో వీరిలో కీలకపాత్ర కానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఒక్క సీటు దూరంలో ఆగిపోవడంతో బీఎస్పీ సహకారం కోరుతూ ఆ పార్టీ నేతలతో మంతనాలు ప్రారంభించిది.
అంతకముందే బీఎస్పీ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించింది. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ - ఎస్పీ - బీఎస్పీ సిద్దాంతాలు ఒకటే అన్న సంకేతాలు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ మద్దతు కాంగ్రెస్ కే ఇస్తున్నట్లు తెలుపడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతుంది.