Begin typing your search above and press return to search.
బీజేపీకి ఓటేసినందుకు వేలు కట్ చేసుకున్నాడట!
By: Tupaki Desk | 19 April 2019 4:28 AM GMTరాజకీయ అభిమానానికి ఇది పరాకాష్ట అని చెప్పాలేమో. పొరపాటున భారతీయ జనతా పార్టీకి ఓటేశానంటూ ఒక దళిత యువకుడు తన చేతి వేలును కట్ చేసుకోవడం విస్మయాన్ని కలిగించేదిలా ఉంది. ఈ మేరకు అతడు ఒక వీడియోను విడుదల చేశాడు. తను పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు ప్రాయశ్చితంగా తన వేలును కట్ చేసుకున్నట్టుగా ఆ యువకుడు ప్రకటించుకున్నాడు.
బులంద్ షహర్ నియోజకవర్గం పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం. అక్కడ బీఎస్పీ-ఎస్పీ-ఆర్ ఎల్డీల ఉమ్మడి అభ్యర్థికి ఓటేయాలని పవన్ కుమార్ అనే పాతికేళ్ల వయసున్న ఒక దళిత యువకుడు అనుకున్నాడట. అయితే తీరా పోలింగ్ బూత్ లోకి వెళ్లాకా కన్ఫ్యూజన్ తో బీజేపీకి ఓటు వేశాడట.
అది అతడికి మాత్రమే తెలిసిన విషయం.బయటి వాళ్లకు తెలియదు. అయితే అతడు ప్రశాంతంగా ఉండలేకపోయాడట. తను పొరపాటు చేసినట్టుగా ఫీల్ అయ్యి - బీజేపీకి ఓటు వేయడం పాపమని అనుకుని.. తను ఓటు వేసిన వేలిని తనే కట్ చేసుకున్నాడట. ఈ మేరకు ఒక వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఆ వీడియో అనంతరం డిలీట్ అయ్యింది.
ఇందులో వాస్తవం ఏమిటో కానీ.. ఈ బీఎస్పీ హర్డ్ కోర్ అభిమాని ఏదో పొరపాటున జరిగిన దానికి కూడా మరీ అంతగా రియాక్ట్ అయిపోవడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది!