Begin typing your search above and press return to search.
ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఫ్లెక్సీలు
By: Tupaki Desk | 7 Oct 2022 7:10 AM GMTజాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున దేశవ్యాప్తంగా అభ్యర్థులను బరిలోకి దించి తన సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా కేంద్రంలో అధికార బీజేపీకి షాకివ్వాలనే యోచనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక కామెంట్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా కేసీఆర్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలపై ఆశలు పెట్టుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో తెలుగు ప్రజలు భారీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఓట్లతోపాటు ఆయా రాష్ట్రాల్లో రైతులను ఓట్లను కొల్లగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై విమర్శలే ఎక్కువయ్యాయి. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీ ప్రజలను దూషించిన కేసీఆర్ పార్టీని ఏపీలో ఎవరూ పట్టించుకోరని వైసీపీ నేతలు తేల్చిచెప్పారు. వచ్చే 25 ఏళ్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీతో తమకొచ్చే నష్టం, కష్టం ఏమీ లేవని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని పేర్కొంటూనే తాము ఎవరి కూటమిలో, ఫ్రంట్‌లో కలవబోమని తేల్చిచెప్పారు.
అయితే అనూహ్యంగా కేసీఆర్ పార్టీ ఏర్పాటుకు మద్దతుగా ఏపీలోని కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీలు వెలవడం గమనార్హం. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని తానేనంటూ ఒకరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు ఇవి చర్చనీయాంశమయ్యాయి.
రేవు అమ్మాజీరావు పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ పేరు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో బ్యానర్లు వెలవడంపై స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు.
తాజాగా బీఆర్ ఎస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనం సృష్టిసోంది. ఇంకా బీఆర్ఎస్ తరఫున కమిటీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులను ప్రకటించలేదు. అయితే అప్పుడే తానే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని.. అమలాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోయేది తానేనంటూ రేవు అమ్మాజీరావు అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.
ఈ ఫ్లెక్సీల ఏర్పాటు బీఆర్ ఎస్ నాయకులకు తెలుసా.. లేకపోతే దీని వెనుకాల ఏదైనా రాజకీయ వ్యూహాం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి స్పందన ఉంటుందనే విషయం తెలుసుకోవడానికి వీటిని ఎవరైనా ఏర్పాటు చేశారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడీ ఈ విషయం కోనసీమ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.