Begin typing your search above and press return to search.

తమ్ముడు అంటూ జగన్ ని ఎంత మాట అనేశాడు

By:  Tupaki Desk   |   15 March 2016 6:17 AM GMT
తమ్ముడు అంటూ జగన్ ని ఎంత మాట అనేశాడు
X
అవినీతి ఆరోపణల మీద తాను జైలుకు వెళ్లటం భవిష్యత్తులో తాను ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో..? ఎన్ని మాటలు పడాల్సి ఉంటుందన్న విషయాన్ని జగన్ ఊహించి ఉండరేమో. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు జగన్ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మిగిలిన వారి కంటే తాను చాలా ప్రత్యేకమని ఫీలయ్యే జగన్ లాంటి నేత.. వ్యంగ్య వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి రావటానికి మించిన ఇబ్బంది మరేం ఉంటుంది.

ఏపీ అసెంబ్లీలో ఏపీ సర్కారు మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతలు జగన్ పై ఓ రేంజ్ వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో.. 22 ఏళ్ల వయసులో జగన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారంటూ అప్పుడెప్పుడో జరిగిన ఘటనను గుర్తు చేస్తే.. జగన్ కు కొవ్వు అంటూ మరో మంత్రి తీవ్రస్థాయిలో మండిపడటం కనిపిస్తుంది.
ఎవరెన్ని అన్నా.. కొంతమంది సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలు జగన్ ను శూలాలతో పొడిచినట్లుగా ఫీల్ కావటం ఖాయం. అందుకు ఉదాహరణగా టీడీపీ సీనియర్ నేత.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల్ని చెప్పాలి. జగన్ ను టార్గెట్ చేసుకున్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉన్నాయంటే..

స్కాముల స్వామి జగన్.. ఇంకెవరో స్కాములు చేశారని మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించటమే కాదు.. తనప్రసంగంలో భాగంగా స్వరం పెంచి.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘చూడు తమ్ముడు.. నీ ఖైదీ నెంబరు 6093 కదా. లేదా.. నేను ఏమైనా పొరపాటు పడ్డానా?’’ అంటూ వివరాలున్న పుస్తకాన్ని చూస్తే జగన్ పై వేసిన వ్యంగ్యాస్త్రం ఏపీ విపక్ష నేతకు ఎంతగా మంట పుట్టించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదేమో.