Begin typing your search above and press return to search.
వైసీపీ ప్రభుత్వంలో రంగులకి ఓ మంత్రిత్వ శాఖ ఇస్తే బాగుంటుంది!
By: Tupaki Desk | 11 Dec 2020 9:09 AM GMTఏపీలో అధికార వైసీపీ , విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారు. అయితే , దానిపై విపక్షాలు నానా రచ్చ చేయడం , ఆ తరువాత రంగులు మార్చడం తో మొదలైన పంచాయతీ ఈ రోజుకి కొనసాగుతుంది. రంగులు మార్చే ప్రభుత్వం అంటూ ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేసే స్థాయికి చేరింది. తాజగా టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సర్కార్ పై వేసిన సెటైర్ ఆసక్తికరంగా మారింది.
రాజమహేంద్రవరం రూరల్ కాతేరు-తొర్రెడు మధ్య ఉన్న గతంలో టిడిపి ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు నాడు నేడు అంటూ ట్వీట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ తన క్యాబినెట్ లో రంగులతో మంత్రిత్వశాఖను కేటాయిస్తే బాగుంటుందంటూ తన ట్వీట్ ద్వారా ఓ సలహా ఇచ్చారు. టిడిపి హయాంలో కట్టిన ఇళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వ ఇప్పుడు రంగులు మారుస్తున్న కారణంగా, ఆయన ముఖ్యమంత్రికి ఈ సలహా ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలో కేవలం రంగులకి ఒక మంత్రిత్వశాఖను కేటాయిస్తే బాగుంటుంది అంటూ సెటైరికల్ ఓ ట్విట్ చేశారు. టీడీపీ కట్టిన ఇళ్ళు ఇప్పటివరకు ఇవ్వకుండా, ఇప్పుడు వాటికి రంగులు మార్చి మీరే ఏదో కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని గోరంట్ల విమర్శలు కురిపించారు.
ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఆర్టీసీ బస్సులకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే ప్రభుత్వ ప్రకటనలకు సైతం వైసిపి రంగులనే వాడడం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు పిల్లలు చదువుకునే పుస్తకాలు , స్కూల్ బ్యాగ్స్ కూడా వదల్లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళకు వైసీపీ రంగులను వేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వంలో రంగులకి ఒక మంత్రిత్వశాఖను కేటాయిస్తే బాగుంటుంది అంటూ అయన చేసిన సెటైరికల్ ట్విట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.