Begin typing your search above and press return to search.
జగన్ హీరోయిన్ల పేర్లు చదువుతున్నాడా ?.... టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్
By: Tupaki Desk | 2 Nov 2019 1:06 PM GMTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తన సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి కౌంటర్లపై బుద్ధ వెంకన్న సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న ప్రతి అంశంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఏదో ఒ కౌంటర్ వేస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి బుద్ధా చేసిన హాట్ హాట్‌గా ఉంది.
తన ట్వీట్‌లో బుద్ధా చూడకుండా ప్రసంగించే వాడు తప్పు మాట్లాడితే పప్పు అన్నారని.. మరి చూసి తప్పు మాట్లాడిన వారిని ఏమనాలి ? అని బుద్ధా సూటిగా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గారు మీ ముఖ్యమంత్రి హీరోయిన్ల పేర్లు చదువుతున్నారేంటి ? ఓహో నిరక్షరాస్యతకి వచ్చిన పాట్లా.. చూడకుండా ప్రసంగం చేసేవాడు తప్పు మాట్లాడితే మీరు పప్పు అని సంబరపడ్డారు.. మరి చూసి కూడా చదవ లేని వాడిని ఏమి అంటారు..? విజయసాయిరెడ్డి గారు.. ముద్ద పప్పు అంటారా..? అని జగన్ ప్రసంగంపై బుద్ధా కౌంటర్ వేశారు.
నిరా రక్షత అంటే.. నిరక్ష్యరాస్యత, దీవితాన్ని పణంగా అంటే.. జీవితాన్ని అనుకుంటా.. సంఘసస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు.. కానీ చివర్లో అన్నారు చూడండి.. ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అని.. అద్గది అది మాత్రం అర్థం కాలేదు.. మీకు అర్థం అయితే చెప్తారా విసా రెడ్డి గారు.. అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ఇక బుద్ధా జగన్ చేసిన ప్రసంగాన్ని విజయసాయిని లింక్ చేస్తూ కౌంటర్ చేయడం వెనక మరో కారణం కూడా ఉంది.
విజయసాయి తన సోషల్ మీడియా వేదికగా ఎక్కువుగా పెదబాబు, చినబాబు అంటూ చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్‌ను పప్పు అంటూ ఆ పదాన్ని వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బుద్ధా వెంకన్న కూడా విజయసాయి హైలెట్ చేసిన పప్పును కౌంటర్ చేస్తూ సుద్ద పప్పు పదంతో జగన్‌ను టార్గెట్ చేశారు. ఏదేమైనా లోకేష్ పప్పు అన్నది ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో అందరికి తెలిసిపోయింది. చినబాబు పొలిటికల్ సత్తా ఎంత ? జగన్‌తో కంపేరిజన్ చేస్తే లోకేష్ ఎక్కడ ఉంటాడో ? వెంకన్నకు తెలియందీ కాదు.. కాకపోతే చినబాబును ఎన్ని జాకీలు పెట్టి లేపినా... ఎంత సపోర్ట్ చేసినా... జగన్‌ను ముద్ద పప్పు అన్నా తెలుపు తెలుపే కాని నలుపు కాదన్నది వెంకన్న ముందుగా తెలుసుకుంటే మంచిదేమో...!