Begin typing your search above and press return to search.
బాలయోగి ఆస్తుల్ని కాజేశానన్న మాట నిజం..!
By: Tupaki Desk | 16 July 2019 5:42 AM GMTతెలుగు తమ్ముళ్ల మధ్య ట్వీట్ల రచ్చ ఇప్పట్లో ఆగేటట్లు కనిపించట్లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరిపైనైనా ట్వీట్లు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేశినేని ట్వీట్లకు పంచ్ లు ఇచ్చే క్రమంలో బుద్ధా వెంకన్న ఎంట్రీ ఇవ్వటంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల సంవాదం ముదిరింది.
పార్టీ పరువును పక్కన పెట్టేసి.. ఒకరిపై ఒకరు ట్వీట్లు చేసుకుంటూ తిట్టుకున్న వైనం సంచలనంగా మారింది. తమ ట్వీట్లతో పార్టీకి జరిగే నష్టం.. రాజకీయవర్గాల్లో పెరిగే చులకనభావాన్ని అస్సలు పట్టించుకోని తత్త్వంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకునే పరిస్థితి. ఇలాంటి దరిద్రాల్ని ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాల్సిన అధినేత.. నిర్లిప్తంగా చూస్తుండిపోయిన చంద్రబాబు తీరు చూస్తే.. ఆయనెంత అయోమయ స్థితిలో ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.
ముఖ్యనేతలు హెచ్చరించారో.. సన్నిహితులు సలహా ఇచ్చారో కానీ ఎట్టకేలకు వీరి ట్వీట్ల రచ్చపై స్పందించిన చంద్రబాబు తనను కలవాల్సిందిగా కబురు పంపారు.
ఇదిలా ఉంటే.. తానిక ట్వీట్లు చేయనంటూ బుద్ధా వెంకన్న ప్రకటించారు.దీంతో ఇష్యూ క్లోజ్ అయినట్లేనని భావించారు. అందుకు భిన్నంగా తాజాగా బుద్ధా వెంకన్నచేసిన ఆరోపణకు సమాధానం అన్నట్లుగా కేశినేని నాని ఈ రోజు మరో ట్వీట్ చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్ని కాజేసిన దొంగ ఎవరో దేశానికి తెలుసని.. ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా? నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. వినే ధైర్యం నీకుందా? అంటూ కేశినేనిని ఉద్దేశించి ట్వీట్లు చేశారు.
దానికి సమాధానం అన్నట్లుగా నాని ఈ ఉదయం (మంగళవారం) ట్వీట్ చేశారు. తాను బాలయోగి ఆస్తుల్ని కాజేశానని ఒక ప్రబుద్ధుడు చెప్పింది యదార్థమని.. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి.. నిజాయితీ.. విలువలు.. సిద్ధాంతాలు.. ప్రజల పట్ల అంకిత భావం.. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి అని.. వాటిని తాను కాజేసి పాటిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని సమాధానం ఇచ్చారు. మరి.. ఈ ట్వీట్ కు బదులుగా మరో మాటను బుద్ధా అనేస్తారా.. లేదంటే బాబు చెప్పినట్లుగా బుద్దిగా ఉండిపోతారా? అన్నది చూడాలి. ఏమైనా..ట్వీట్లతో చెలరేగిపోయే విషయంలో తాను వెనక్కి తగ్గనన్న విషయాన్ని కేశినేని తాజా ట్వీట్ తో స్పష్టం చేశారని చెప్పక తప్పదు.