Begin typing your search above and press return to search.

కొడాలినాని ఆయిల్ దొంగతనాలు చేసేవాడు: బుద్దా వెంకన్న

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:35 PM GMT
కొడాలినాని ఆయిల్ దొంగతనాలు చేసేవాడు: బుద్దా వెంకన్న
X
గుడివాడ క్యాసినో వివాదం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన ఆయన మరోసారి మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. తాను వ్యాపారం చేసే రోజుల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేసేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇవిప్పుడు దుమారం రేపాయి.

బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. '1991లో నెలకు రూ.1.15 లక్షల అద్దె కట్టి తాను కొబ్బరికాయల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో కొడాలినాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని' తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని వద్ద పాన్ పరాక్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవన్నారు. అలాంటి కొడాలి నానికి ఇంత డబ్బు ఎక్కడిది? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొడాలి నాని ఎలా కట్టాడని ప్రశ్నించాడు.

చంద్రబాబుకు, కొడాలి నానికి ఒకేసారి కరోనా వస్తే.. బాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉంటే.. కొడాలి మాత్రం చికిత్స కోసం పక్కరాష్ట్రంలోని ఆస్పత్రికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలు వెళ్లకుండా అడ్డుకోవడానికి గుడివాడ ఏమైనా పాకిస్తాన్ నా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

చంద్రబాబును తిట్టిన కొడాలినాని భాషపై ఫిర్యాదు చేస్తే కేసు పెట్టినా అక్ నాలెడ్జ్ మెంట్ ఇవ్వలేదని.. తనపై విచారించినట్టే.. మంత్రి కొడాలి నానిపై కూడా కేసు పెట్టి విచారించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. మంత్రి కొడాలి నానితోపాటు డీజీపీని తీవ్రంగా విమర్శించారు. ఓ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపుల వరకూ వెళ్లారు. ఆయన అలా కామెంట్స్ చేశారో లేదో.. పోలీసులు వేగంగా స్పందించారు.

బుద్దా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లారు.దీంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు బుద్దావెంకన్నపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. బెయిల్ పై బుద్దా వెంకన్న విడుదలయ్యారు. అనంతరం బయటకు వచ్చి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు.