Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముడి మాట‌...వైసీపీలోకి పురందేశ్వ‌రి?

By:  Tupaki Desk   |   5 April 2017 10:54 AM GMT
తెలుగు త‌మ్ముడి మాట‌...వైసీపీలోకి పురందేశ్వ‌రి?
X
ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... పార్టీ ఫిరాయింపుల‌ను ఎలా ప్రోత్స‌హిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. తెలంగాణ‌లో త‌న పార్టీ టికెట్‌ పై ఎమ్మెల్యేగా గెలిచిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్... ఆ త‌ర్వాత టీఆర్ ఎస్‌ లో చేరి మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన నాడు అరిచి గ‌గ్గోలు పెట్టిన చంద్ర‌బాబు... మొన్న త‌న కేబినెట్ రీష‌ఫిలింగ్‌ లో భాగంగా వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన న‌లుగురికి మంత్రి ప‌ద‌వులిచ్చారు. దీనిపై జ‌నాల్లో విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతున్నా కూడా... ఏమాత్రం ప‌ట్టించుకోని చంద్ర‌బాబు.. నిస్సిగ్గుగానే త‌మ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన వారికి మంత్రి ప‌ద‌వులిచ్చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వైసీపీ మాట‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకున్న దాఖ‌లా కూడా క‌నిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ద‌మ‌న నీతిపై బీజేపీ మ‌హిళా నేత‌, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు తారా స్థాయికి చేరాయ‌ని, వీటికి చెక్ పెట్టేలా చర్య‌లు చేప‌ట్టాల‌ని కూడా ఆమె త‌న ఫిర్యాదులో ప్ర‌ధానిని కోరారు. ఈ క్ర‌మంలో త‌మ‌పైనే ప్ర‌ధానికి ఫిర్యాదు చేస్తారా? అంటూ తెలుగు త‌మ్ముళ్లు పురందేశ్వ‌రిపై ఆగ్ర‌హావేశాల‌కు గుర‌వుతున్నారు. ఈ విష‌యంపై టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు లాంటి వారు ఓ స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసి వ‌దిలేసినా... టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న లాంటి నేత‌లు మాత్రం సంచల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు తెర తీశారు. పురందేశ్వ‌రి ప్ర‌క‌ట‌న‌లు చూస్తుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పురందేశ్వ‌రి పోటీ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని బుద్ధా ఓ పెను బాంబే పేల్చారు.

వైసీపీ త‌ర‌ఫున పురందేశ్వ‌రి పోటీ చేస్తార‌ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయ‌ని కూడా బుద్దా త‌న‌దైన శైలిలో పేట్రేగిపోయారు. ఇందుకు ఆయ‌న చెప్పిన కార‌ణాలు వింటే... నిజంగానే పురందేశ్వ‌రి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా... ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని,ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆమె వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. జగన్ అవినీతి - సూటుకేసు కంపెనీల గురించి పురందేశ్వరి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించిన బుద్దా... ఈ విష‌యాల్నింటినీ ప‌రిశీలిస్తే... వచ్చే ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ పురందేశ్వ‌రి పోటీ చేస్తుందని అనుమానం బలపడుతుందని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/