Begin typing your search above and press return to search.
2019 లో సింహమైతే.. 2014లో ఏమనాలి?
By: Tupaki Desk | 27 May 2018 6:25 AM GMTసినిమా డైలాగులో చెప్పడంలో టీడీపీ నేతలు ఒకరిని మించి ఒకరు ప్రతిభ చూపిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తమ పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని చెబుతూ.. సింహం సింగిల్ గానే వస్తుందని భారీ డైలాగ్ కొట్టారు. ఆయన అలా అన్నారో లేదో ఇలా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 2019లో సింగిల్ గా రానున్న టీడీపీ సింహం అయితే.. 2014 ఎన్నికల్లో బీజేపీ - పవన్ తో కలిసి గుంపుగా వచ్చిన టీడీపీని ఏమనాలంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు మహానాడుకు వచ్చిన బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోరుకు సన్నద్ధమవుతోందని అన్నారు. ఈ మహానాడు నుంచే తమ పార్టీ అధినేత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విజయం ఖాయమని - సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే.. రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలోని డైలాగులో కొంత పార్టును వాడుకుని సింహం సింగిల్ గా వస్తుందని బుద్ధా చెప్పడం ఆ పార్టీ శ్రేణుల చెవులకు ఇంపుగా అనిపించేందేమో కానీ.. విపక్షాలు - నెటిజన్లు మాత్రం వెంటనే ఆ డైలాగు మొత్తాన్ని గుర్తు చేసుకుని బుద్ధాపై సెటైర్లు వేస్తున్నారు. ‘సింహం సింగిల్ గానే వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి’ అన్న డైలాగులోని రెండో భాగాన్ని 2014 ఎన్నికల నాటి టీడీపీ పరిస్థితిని గుర్తు చేసి.. అప్పుడు బీజేపీ - పవన్ లతో కలిసి ఎన్నికలకు గుంపుగా వెళ్లిన చంద్రబాబును ఏమనాలంటూ కామెంట్లు చేస్తున్నారు.