Begin typing your search above and press return to search.

దాసరి, చిరు క‌ల‌యిక‌లో మ‌ర్మం ఇదా?

By:  Tupaki Desk   |   21 Jun 2016 6:19 AM GMT
దాసరి, చిరు క‌ల‌యిక‌లో మ‌ర్మం ఇదా?
X
కాపుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంకు మ‌ద్ద‌తుగా కేంద్ర మాజీ మంత్రులు - సినీన‌టులు దాసరి నారాయ‌ణ‌రావు - చిరంజీవి ముందుకు రావ‌డం వెనుక కొత్త లాజిక్ ఉంద‌ట‌. ముద్ర‌గ‌డ‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే వారిద్ద‌రు ముందుకు వ‌చ్చార‌ని విజ‌య‌వాడ‌ నగర తెదేపా అధ్యక్షుడు - ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని పార్టీ శ్రేణులతో కలసి కేకును కత్తిరించి - మిఠాయిలు పంచారు. అనంతం వెంక‌న్న మీడియాతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ముద్ర‌గ‌డ‌కు మైలేజీ రావొద్ద‌నే దాస‌రి - చిరంజీవి స‌హా వైకాపా నాయకుడు బొత్స తదితరులు రాయబారుల రూపంలో ముందుకు వస్తున్నారని ధ్వ‌జమెత్తారు. కేంద్రం - రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, అప్పట్లో మంత్రులుగా ఉన్న చిరంజీవి - దాసరి - బొత్సలు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోయారని ప్ర‌శ్నించారు. అప్పట్లో వీరు తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. నేడు రాజకీయ లబ్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారని వెంక‌న్న దుయ్యబట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి - హోం మంత్రి చినరాజప్పపై వైకాపా నాయకుడు భూమన కరుణాకరరెడ్డి విరుచుకుపడడాన్ని ఆయన ఖండించారు. నిరాడంబరుడైన రాజప్ప తన సామాజిక వర్గం కోసం మాట్లాడుతుంటే మధ్యలో భూమన జోక్యం చేసుకుని, రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. చినరాజప్పను విమర్శించే స్థాయి భూమనకు లేదన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ - వారి సమస్యల కోసం పోరాటం చేయగల తత్వం ఉండడం వల్లే తెదేపాలోనూ - పార్టీ అధినేత చంద్రబాబు వద్ద గుర్తింపు పొందగలిగినట్టు బుద్దా వెంకన్న చెప్పారు.