Begin typing your search above and press return to search.
రోజా...ఆడదానివైనా వదిలిపెట్టం!
By: Tupaki Desk | 15 Oct 2016 1:43 PM GMTఏపీలో రాజకీయ హీట్ జోరెక్కుతోంది. నల్లధనంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో ప్రారంభమైన ఈ పొలిటికల్ హీట్ వైసీపీ మహిళ నేత రోజా ఎంట్రీతో తారాస్థాయికి చేరింది. రోజా ఘాటు కామెంట్లపై టీడీపీ ఎమ్మెల్సీ - చంద్రబాబు కుటుంబానికి వీర విధేయుడు అయిన బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా ఘాటు విమర్శలు గుప్పించారు. " వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ సీపీకి రోజా పెయిడ్ వర్కర్. జబర్దస్త్ ప్రోగ్రాంలో పెయిడ్ వర్కర్ లాగా పనిచేస్తూ వైసీపీ పార్టీలో కూడా పెయిడ్ వర్కర్ గా పనిచేస్తున్న రోజాకు చంద్రబాబు నాయుడును - యువ నాయకుడు లోకేష్ బాబును మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆమె ఆడదని ఏమీ మాట్లాడరని అనుకుంటున్నారేమో హద్దు మీరితే ఎవరికైనా కౌంటర్ సమాధానం ఇస్తాం. అసెంబ్లీ సమావేశాల నుండి సంవత్సరం పాటు సస్పెండ్ అయినా రోజాకు సిగ్గురాలేదు" అంటూ పరోక్షంగా తమ విమర్శల సత్తాను ప్రకటించారు.
ఈ సందర్భంగా రోజా వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. "లోకేష్ బ్యాటరీ లేని సెల్ ఫోన్ కాదు. మీ పార్టీ అధినేత జగనే అలాంటి వ్యక్తి. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి పాలన చేసుకునే వెసులుబాటు ఉన్నా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ లేకున్నా బస్సులో ఉండి పాలన చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ ప్రజలు చీత్కరించడంతో హైదరాబాద్ లోనో - బెంగళూరులోనో ఉంటూ అప్పుడప్పుడు విజిట్ లాగా ఏపీకి వస్తున్నారు. అలాంటి వ్యక్తి రోజా లాంటి పెయిడ్ వర్కర్ లతో మాట్లాడిస్తున్నారు. ఆమెకు విమర్శలు చేసే స్థాయి ఉందా?" అంటూ నిలదీశారు. పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శిగా లోకేష్ పనిచేస్తుంటేనే భయపడుతున్న వారు లోకేష్ బాబు మంత్రిగా పనిచేస్తే వైసీపీ పార్టీ ఉనికే ఉండదనే భయంతో మాట్లాడుతున్నారని వెంకన్న ఆరోపించారు. అమెరికాలో చదువుకొని తండ్రి బాటలో నడిచే లోకేష్ బాబు ఎక్కడ. తండ్రిని కాదని బాబాయి వివేకానంద రెడ్డి ఎంపీ సీటును తన స్వార్థం కోసం ఖాళీ చేయించాలని చూసిన జగన్ రెడ్డి ఎక్కడ అని ప్రశ్నించారు.
లోకేష్ శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి అని చెప్పిన బుద్దా వెంకన్న తండ్రిని ఎదిరించి. తల్లిని ఎదిరించి ఆఖరికి చెల్లెలను హింసించి కూర్చోబెట్టిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. జగన్ ప్రవర్తన నచ్చక వైఎస్సార్సీపీ పార్టీని ఎమ్మెల్యేలు వీడి తెలుగుదేశ పార్టీలో చేరుతున్నా సిగ్గురాలేదని మండిపడ్డారు. తామ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకే రాజ్యసభకు పంపామని బుద్దా వెంకన్నతెలిపారు. చాలా కాలం నుంచి పార్టీలో కష్టపడుతున్న సుజనా చౌదరికి - పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చిన టీజీ వెంకటేశ్ కు రాజ్యసభ ఇచ్చామని గుర్తుచేశారు. అయితే తనతో పాటు జైలు జీవితం గడిపి అవినీతి సొమ్మను కాపాడాలని చూస్తున్న విజయ సాయిరెడ్డికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చాడని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/