Begin typing your search above and press return to search.
బుద్ధా వెంకన్న ఇప్పుడు ఆదర్శ పురుషుడా?
By: Tupaki Desk | 10 Sept 2015 10:28 AM ISTబుద్ధా వెంకన్న అంటే.. ఇటీవల ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న తెలుగుదేశం నాయకుడు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అందరికీ హఠాత్తుగా ఆదర్శపురుషుడుగా తయారైపోయారు. ఆయన నడిచిన బాటలోనే నడవాలని పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నాయకులు తెగ ఉత్సాహపడిపోతున్నారు. ఆయన చేసినట్లుగా చేస్తే మాత్రమే పార్టీలో తమకు మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని, వ్యక్తిగత అభిప్రాయాలకంటె భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం గనుక.. అలాగే చేసేద్దాం అని.. అందరూ ఉవ్విళ్లూరుతున్నారు.
ఇంతకూ బుద్ధా వెంకన్న ఏం చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రీతికరమైన పని (బహుశా) చేశారు. అదేంటంటే.. నారా లోకేష్ ను పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి పదవిలో నియమించాల్సింది కోరుతూ అధినేతకు ఒక వినతి పత్రం సమర్పించారు.
చంద్రబాబునాయుడు ఈ సిఫారసును పరిశీలించి లోకేష్ అంత పెద్ద బాధ్యతలకు కట్టబెడతారా లేదా అనేది వేరే సంగతి. ముందస్తుగా అధినేతను సంతృప్తి పరచడానికి, తమ మీద దృష్టి పడేలా చేసుకోవడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది కదా.. అని పార్టీ నాయకులంతా అనుకుంటున్నారుట. చంద్రబాబు దృష్టిలో పడాలంటే.. కేవలం జగన్ ను తిట్టడంతో సరిపోదు, లోకేష్ కు పార్టీలో పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించాల్సిందిగా కోరుతూ చంద్రబాబుకు లేఖలు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారుట.
ఆ కోణంలోంచి చూసినప్పుడు బుద్ధా వెంకన్న అందరికీ ఆదర్శ పురుషుడు అయిపోయాడు. ఇప్పుడిక అందరూ ఇలాంటి లేఖలు పట్టుకుని బయల్దేరుతారు. 'రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మరియు నాయకులు అందరూ చేస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని' చంద్రబాబునాయుడు రేపు నిర్ణయం తీసుకుంటే.. తమకు కూడా భవిష్యత్తు బాగుటుందని కలలు కంటున్నారుట.