Begin typing your search above and press return to search.

రోజాపై టీడీపీ నేత చిల్ల‌ర కామెంట్లు..నెటిజ‌న్ల ఫైర్‌

By:  Tupaki Desk   |   6 May 2018 2:43 PM GMT
రోజాపై టీడీపీ నేత చిల్ల‌ర కామెంట్లు..నెటిజ‌న్ల ఫైర్‌
X
బుద్ధా వెంక‌న్న‌. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ కూడా. త‌న‌కు తాను టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కుటంబానికి వీర‌విధేయుడిగా ప్ర‌క‌టించుకుంటుంటారు. ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌ ను పొగ‌డ‌టంలో ముందుంటారు. అందుకే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింద‌నేది కొంద‌రి వాద‌న‌. ఆ విష‌యం అలా ఉంచితే...మహిళ‌ల‌ను తాము గౌర‌విస్తామ‌ని - సంస్కృతి సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించుకునే టీడీపీకి చెందిన ఈ నాయ‌కుడు తాజాగా మ‌హిళ‌ల‌పై స్పందించిన తీరును చూసి నెటిజ‌న్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలైతే..విచ‌క్ష‌ణ మ‌రిచి విమ‌ర్శ‌లు చేస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

విజయవాడలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ రోజా‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ దండుపాల్యం గ్యాంగ్ తిరుగుతోందని ఆయ‌న ఆరోపించారు. పగలంతా తిరుగుతూ రాత్రుల్లు దోచుకొనే మాదిరిగా వైసీపీ దండుపాల్యం సంచరిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న విమ‌ర్శించారు. `వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు రోజా‌ పట్టపగలు మద్యం సేవించి మీడియా ‌ముందుకు వస్తోంది. రోజాను బురదలో దొర్లే పంది మాదిరిగా వదిలేశారు. రోజాకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేయాలి. రోజా జబర్ధస్త్ చూసి యువ చెడద్రోవపడుతున్నారు. రోజా నీతులు చెబుతుంటే బూతులు మాట్లాడుతున్నట్టుంది. మద్యం సేవిస్తామని మేము రుజువు చేస్తాం..బ‌హిరంగ చర్చకు సిద్ధమా? విజయవాడలో రోజా‌ పర్యటిస్తే కోడిగుడ్లతో కొట్టడానికి పార్టీలకతీతంగా మహిళలు రెడీగా ఉన్నారు. రోజా‌ది ఏనుగుపాదం....నువ్వు ఆరోపణలు చేసిన వారి మీద‌ సాక్ష్యాలు ఉన్నాయా...డిబేట్ కు రెడీ` అంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, పార్టీ నేతలు ఈ స్థాయిలో ఎదుటి మ‌హిళ‌పై తీవ్ర వివాదాస్ప‌ద కామెంట్లు చేస్తుంటే..తెల‌గుజాతి బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌మ‌ని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ నేత చంద్ర‌బాబు ఎందుకు స్పందించడం లేదని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ నేత‌లు క‌ట్టుదాటితే..క్ర‌మ‌శిక్ష‌ణ అతిక్ర‌మిస్తే వారిని చ‌క్క‌దిద్దాల్సింది పోయి చూసి చూడ‌న‌ట్లు ఉండ‌టం ఎలాంటి సంకేతాలు పంపిస్తాయ‌ని అంటున్నారు. ఇదిలాఉండ‌గా...ఎమ్మెల్యే రోజాపై వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు.ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ మహిళలతో లోకేశ్‌ అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇంట్లో పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తుచేశారు. తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్దా వెంకన్నను హెచ్చరించారు.