Begin typing your search above and press return to search.
కృష్ణ పరమాత్మకే బాబు ఎమ్మెల్సీ దెబ్బేశాడట
By: Tupaki Desk | 3 July 2016 5:00 AM GMTరానున్న కృష్ణా పుష్కరాల్ని పురస్కరించుకొని బెజవాడలో రోడ్ల విస్తరణ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా దేవాలయాల్ని కూల్చి వేసిన ఘటన తీవ్ర కలకలాన్ని.. స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎలాంటి నోటీసు లేకుండా బెజవాడోని అర్జున వీధిలో ఉన్న కృష్ణుడి ఆలయాన్ని.. గోశాలను రాత్రికి రాత్రే ప్రొక్లయిన్లతో కూల్చేసిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఈ దేవాలయాన్ని కూల్చి వేసే విషయంలో అధికారులు తొందరపాటుతో వ్యవహరించటంతో పాటు.. తొండిగా వ్యవహరించారంటున్నారు. దేవుడినే దెబ్బేస్తూ.. చంద్రబాబు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ (బుద్దా వెంకన్న)కి ప్రయోజనం కలిగే రీతిలో వ్యవహరించటం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. ఎమ్మెల్సీ ప్రయోజనాల కోసం అధికారులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారన్న ఆరోపణకు బలం చేకూరేలా సాక్ష్యాల్ని స్థానికులు చూపిస్తున్నారు.
అర్జున వీధిలో ఉన్న కృష్ణుడి ఆలయం.. దాదాపు 350గోవుల్ని సంరక్షించే గోశాలను కూల్చేందుకు వీలుగా 60 అడుగుల వెడల్పు ఉన్న వీధి రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. అంటే.. మొత్తం 40 అడుగుల మేర స్థలం కావాలి. ఇలాంటి సమయంలో కుడి.. ఎడమల 20 అడుగుల చొప్పున కూల్చేయటం ఎక్కడైనా చేస్తుంటారు.
కానీ.. ఇందుకు భిన్నంగా అర్జున వీధిలో మాత్రం కృష్ణుడి మందిరం ఉన్న వైపే 40 అడుగులు విస్తరించటం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. ఇదంతా కూడా మరో వైపు ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆఫీసు.. ఇల్లు.. ఆయన అనుచరుల ప్రయోజనాల్ని కాపాడేందుకే అధికారులు ఇలా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం దేవుడి గుడిని కూడా కూల్చేందుకు అధికారులు సిద్ధం కావటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు.. విమర్శల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉంది. విపక్షాలు.. స్థానికులు చెబుతున్నట్లుగా దేవాలయాల కూల్చివేతలో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారా? లేదా? అన్న విషయాన్ని బాబు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే.. స్థానికంగా బాబుపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.