Begin typing your search above and press return to search.
విజయసాయిరెడ్డిని అరగంటలో అరెస్ట్ చేయిస్తారట
By: Tupaki Desk | 22 April 2017 5:50 PM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు హెచ్చరికలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగంలో సోదాలు చేసిన తీరును విజయసాయిరెడ్డి తప్పుపట్టిన సంగతి తెలిసిదే. దీనిపై బుద్ధా వెంకన్న ఘాటుగా మండిపడ్డారు. అసెంబ్లీకి కార్యదర్శికి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి బెదిరించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఆఫీసులో సోదాలు చేస్తున్న సమయంలో విజయసాయి తప్పుపట్టారని అయితే... ఒకవేళ విజయసాయిరెడ్డి ప్రభుత్వంపై అభ్యంతరకర పోస్ట్ పెడితే అరగంటలో అరెస్ట్ చేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, శిక్ష ఖాయమని వెంకన్న హెచ్చరించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కేబినెట్‌లోకి వచ్చి నెలకూడా కాలేదని పేర్కొంటూ లోకేష్‌ను చూసి వైసీపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
కాగా, ఈ ఉదయం హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంపై దాడి చేసి ఆఫీసులో సోదాలు చేయడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. పోలీసుల తనిఖీలపై విస్మయం వ్యక్తం చేస్తూ వారి సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు తాము పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పడంపై విజయసాయిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిన ఫిర్యాదుకు ఎలా స్పందించారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని విజయసాయిరెడ్డి నిలదీశారు. ఏపీ ప్రభుత్వం తమకో నీతి, ఇతరులకు ముఖ్యంగా ప్రతిపక్షాల తరఫున గళం విప్పేవారికి మరో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఆయన కుటుంబసభ్యులపై సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు పెట్టిన విషయం పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ప్రస్తుత మంత్రి లోకేష్ సైతం జగన్‌ను దూషిస్తూ పెట్టిన ట్వీట్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు.