Begin typing your search above and press return to search.
'యువజన శృంగార రసిక చిలిపి పార్టీ'.. బుద్దా టైమింగ్ లెక్కే వేరుగా !
By: Tupaki Desk | 6 Aug 2022 6:03 AM GMTటైమంటే టైమన్నట్లుగా వ్యవహరించే విషయంలో ఏపీ రాజకీయ నేతల తీరు చూసినప్పుడు మాత్రం గొప్పగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో అధికార.. విపక్ష నేతల మధ్య పోరు నువ్వు అంటే నువ్వు అన్నట్లుగా ఉంటే.. ఆ లెక్కనే వేరుగా ఉంటుంది. మేం ఇక్కడ అధికార వైసీపీనో.. విపక్ష టీడీపీనో వెనకేసుకురావటం లేదు.
ఏదైనా రాష్ట్రంలో అధికార.. విపక్షాల మధ్య ఎవరూ తగ్గనట్లు ధీటుగా ఉంటే.. రాజకీయం రంజుగా మారుతుంటుంది. అనుకోని రీతిలో అధికార వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం సొంత పార్టీ వారికి సైతం షాకిచ్చేలా మారింది. జరిగిన ఉదంతాన్ని ఏదోలా వాదన వినిపించేందుకు విషయం ఏమీ లేకపోవటంతో వారు గొంతులో పచ్చి వెలక్కాయన పడిన చందంగా ఉన్న పరిస్థితి.
దీన్ని గుర్తించిన ఏపీ విపక్షం తనదైన శైలిలో ఎదురుదాడిని ముమ్మరం చేసింది. దొరికిన అవకాశాన్ని నూటికి నూరు శాతం వాడేసేలా తెలుగు తమ్ముళ్లు తమ మాటలకు పదును పెడుతున్నారు.
మిగిలిన వారితో పోలిస్తే..సీనియర్ తెలుగు తమ్ముడు.. మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ (వైఎస్సార్ కాంగ్రెస్)కి కొత్త అర్థాన్ని చెప్పిన వైనం అధికార పార్టీ వారు నోరెళ్లబెట్టేలా చేసింది.
వైఎస్సార్ సీపీని.. .. ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా బుద్దా వెంకన్న అభివర్ణించారు. ఇక్కడితో ఆగని బుద్దా.. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల తీరును టైమ్లీగా ప్రస్తావించారు.
‘అవంతి అరగంట సరసం.. అంబటి గంట విహారం ఆడియోలు వయటకు వస్తే వారిపై జగన్ ఏం చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి చేస్తేనే అధినేత గుర్తిస్తున్నారని.. ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా న్యూడ్ వీడియోను బయటకు వదిలారు’ అంటూ మండిపడ్డారు.
గోరంట్ల మాధవ్ లీలలు మెచ్చి జగన్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సమయానికి తగ్గట్లు.. బుద్ధా వెంకన్న నోటి నుంచి అధికార పార్టీకి కొత్త అర్థం వైసీపీ నేతల్ని ఉడికిపోయేలా చేస్తోంది. ధీటుగా బదులిచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమకు అవకాశం రాకపోదని.. అంతకంతా బదులు తీర్చుకుంటామని వారు మండిపడుతున్నారు.