Begin typing your search above and press return to search.

డ్రగ్స్ టెస్టులో అడ్డంగా బుక్కయిన సన్యాసులు..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 9:53 AM GMT
డ్రగ్స్ టెస్టులో అడ్డంగా బుక్కయిన సన్యాసులు..!
X
సన్యాసుల లైఫ్ మనకంటే చాలా భిన్నంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. లోక కల్యాణం కోసం పాటుపడే సన్యాసులు నిత్యం దైవారాధనలోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా భక్తి మార్గంలో ప్రయాణిస్తారు. వీరి జీవన విధానాన్ని అనుసరించడం అందరికీ సాధ్యం కాదు.

ఇక మనదేశంలో సన్యాసులు ఎక్కువగా కాశీ.. హిమాలయాల్లో కన్పిస్తుంటారు. శివారాధన చేసే సన్యాసులకు మినహాయిస్తే మిగతా వారంతా ఒకే రీతిలో సన్యాసన్ని అవలంభిస్తుంటారు. బౌద్ధ సన్యాసులు.. జైనుల ఆహార అలవాట్లు ఒకేలా ఉంటాయి. మద్యం.. మాంసానికి పూర్తిగా దూరంగా ఉంటారు. కేవలం పళ్లు.. కూరగాయలు తింటూ కాలం గడుపుతుంటారు. ముఖ్యంగా బౌద్ద సన్యాసులు ఖచ్చితమైన నియమాలు పాటిస్తుంటారు.

అయితే థాయిలాండ్ లోని ఓ బౌద్ద ఆలయంలోని సన్యాసులు మాత్రం డ్రగ్స్ కు అలవాటు పడినట్లు తేలడంతో ప్రతీఒక్కరూ అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం థాయిలాండ్ లో వెలుగు చూసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశం మారింది. దీంతో అసలు విషయం తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

థాయిలాండ్ లోని ఫెట్చాబున్ రాష్ట్రం బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక బౌద్ద ఆలయం ఉంది. ఇందులో ఒక మఠాధిపతి సహా నలుగురు బౌద్ద సన్యాసులు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. అయితే వీరంతా మత్తు పదార్థాలకు బానిస అయినట్లు తాజాగా నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో వెల్లడైంది.

బౌద్ద ఆలయంలోని మఠాధిపతి సహా నలుగురు సన్యాసులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి డ్రగ్స్ నుంచి వారిని బయట పడేలా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆ ఆలయంలో ఎలాంటి పూజలు జరగడం లేదు.

దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో థాయిలాండ్ ప్రభుత్వం కొత్తగా సన్యాసులను నియమించేందుకు ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి లావోస్ వచ్చే మెథాంఫేటమిన్‭ డగ్స్ రవాణాకు ప్రధాన మార్గంగా థాయిలాండ్ మారిందని డ్రగ్స్ అండ్ క్రైమ్‌పై ఐరాస గతంలో ఒకసారి వెల్లడించింది. ఏది ఏమైనా బౌద్ద సన్యాసులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.