Begin typing your search above and press return to search.
బడ్జెట్ ను మెచ్చని కార్పొరేట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
By: Tupaki Desk | 1 Feb 2020 9:48 AM GMTఆకాంక్ష, ఆర్థికాభివృద్ది, సంక్షేమం అనే ఇతివృత్తం తో బడ్జెట్ రూపొందించామని చెబుతూ ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన పలు అంశాలు, నిర్ణయాలకు మధ్య తరగతి, సామాన్య ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా కార్పొరేట్లు మాత్రం హర్షించలేదు. దీంతో బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్‌లో నష్టాలు చవిచూశాయి.
2020-2021 వార్షిక బడ్జెట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్న సంకేతాలు వచ్చాయి. బడ్జెట్ పూర్తి వివరాలు తెలుస్తుండగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోయాయి. బీఎస్ఈ 700 పాయింట్లు పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో మొదట దూకుడుగా ఉండగా వేగం పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతాంంశాలు ఇన్వెస్టర్ల కు ఊతమిచ్చినట్లుగా భావించారు. బడ్జెట్ పూర్తయిన అనంతరం తమకు ఆశించిన నిర్ణయాలు లేవని భావించడంతో మార్కెట్ లు నష్టాల బారిన పడ్డాయి.
ఉదయం మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమై 11 గంటలకు నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే కొంత ఆశజనకంగా మార్కెట్‌లో కదలికలు వచ్చాయి. ఆ తర్వాత కేటాయింపులు.. వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు వివరిస్తున్న సమయం లో స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు మొదలయ్యాయి.
ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభంలో ట్రేడ్ అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలుంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించడం స్టాక్ మార్కెట్ల కు ఊతమిస్తోందని భావించారు. అయితే.. ఆ తర్వాత వివిధ రంగాలకు కేటాయింపులు వెల్లడిస్తుండగా పరిస్థితులు మారాయి. స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మొదలైంది. బడ్జెట్ ప్రసంగం ముగిసే దాకా ఆ పరిస్థితి కొనసాగింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్లు ఘోరంగా పడి పోయాయి.