Begin typing your search above and press return to search.
అత్తిళ్లు ఆంధ్రను మరిచి.. పుట్టినింటికి పెట్టిన నిర్మల?
By: Tupaki Desk | 1 Feb 2021 2:30 PM GMTఏ ఆడపిల్లకైనా పుట్టినింటిపై పట్టరాని ప్రేమ ఉంటుంది. అదే అత్తింటిపై ఆ మమకారం తక్కువ. ఆ ప్రేమను ఆడపడుచులు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అందుకు అతీతులు కారని నిరూపించుకున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
తాజా బడ్జెట్ లో తమిళనాడుకు భారీగా కేటాయింపులు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మెట్టినిల్లు తెలుగు నేలకు మొండిచేయి చూపించారు. నిధులు విదిల్చడం కాదు కాదు కదా.. కనీసం తెలంగాణ, ఏపీల పేరు కూడా నిర్మల నోటి వెంట ప్రస్తావనకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మోడీ కేబినెట్ లో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఏకంగా ఆర్థికమంత్రిగా చేరాక మన రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా ఆశలు పెంచుకున్నాయి. ఒక్క ఏడాదైనా కరుణిస్తారని ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికీ పైసా విదిల్చడం లేదు. వరుసగా నిర్మల మూడో బడ్జెట్ లోనూ తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు అభివృద్ధి పనుల కింద కేటాయించి తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపుతోంది.
చెన్నై మెట్రోకు రూ.63వేల కోట్లు.. బెంగళూరు మెట్రోకు 14వేల కోట్లు కేటాయించిన నిర్మల హైదరాబాద్, విశాఖలకు రూపాయి విదిల్చలేదు. కేరళ, తమిళనాడుకు పెద్ద ఎత్తున జాతీయ రహదారులకు నిధులు కుమ్మరించి తెలుగు రాష్ట్రాలను గంగలో ముంచేశారు. నిర్మల బడ్జెట్ పై తెలుగు నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ తో ఎండగడుతున్నారు. 'పుట్టింటి మీద ప్రేమ.. అత్తింటిపై లేదు' నిర్మలకు అంటూ నెటిజన్లు మీమ్స్, సెటైర్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.