Begin typing your search above and press return to search.
ఏపీలో వైద్య, విద్యారంగానికి పెద్ద పీట
By: Tupaki Desk | 10 March 2016 11:59 AM GMTసాధారణంగా విద్య, వైద్య రంగాలు బాగుంటేనే ఆయా రాష్ట్రాలు బాగుంటాయనే దానికి దిక్సూచి. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా ఈ రెండు రంగాలకోసం భారీగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా అందికీ విద్య.. అనే నినాదంతో ప్రాథమిక విద్యకోసం సుమారు రూ.17502 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్టుతో పోలిస్తే... సుమారు రూ.3వేల కోట్లకు పైగా అధికం. అలాగే ఉన్నత విద్యకు రూ.2642 కోట్లను కేటాయించింది. ఇలా కేవలం ఉన్నత, ప్రాథమిక విద్యకోసమే... సుమారు రూ.20 వేల కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. మరి ఇంత భారీ బడ్జెట్టుతోనైనా... ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయోమో చూడాలి. అసలే ప్రైవేటు స్కూళ్ల ఆధిపత్యం ఎక్కువగా వుంది. నారాయణ - శ్రీ చైతన్య - భాష్యం కేశవరెడ్డి తదితర యాజమాన్యాలు నాణ్యమైన విద్య పేరుతో పేదల నుంచి సైతం వేల రూపాలయను వసూళ్లు చేస్తున్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున విద్యకోసం నిధులను కేటాయించింది. దాంతోనైనా... ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యలభిస్తుందనే భరోసా గ్రామీణ విద్యార్థులకు కల్పిస్తే... కేటాయించిన బడ్జెట్టుకు సార్థకత చేకూరినట్టే. అలాగే వైద్య రంగానికి కూడా బాగానే కేటాయింపులు చేసింది. వైద్య ఆరోగ్యశాఖకు రూ.2,933 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్టుతో పోలిస్తే... అధికమే. ఇందులో ఆరోగ్యశ్రీతో పాటు... గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం వుంది. అసలు శిథిలావస్థలోవున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... వైద్య సిబ్బంది స్థానికంగా వుండటానికి వీలు లేకుండా వుండే క్వార్టర్స్ కారణంగా ప్రాథమిక వైద్యం పేదలకు అందడం లేదనే చెప్పాలి. మరి ఈ నిధులతోనైనా గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాథమిక వైద్యం అందుతుందో లేదో చూడాలి.